Tiger 3 టైగర్ 3 థియేటర్‌లో బాంబులు పేల్చిన ఫ్యాన్స్.. సల్మాన్ ఖాన్ ఎలా రియాక్ట్ అయ్యాడంటే?

సినిమా హీరోల అభిమానులు ప్రదర్శించే ఉత్సాహం ఇబ్బందికి గురిచేస్తుంది. ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రేక్షకుల ప్రాణాల మీదకు తెస్తుంది. అలాంటి పనులు హీరోలను తలదించుకొనేలా చేస్తుంది. తాజా అలాంటి సంఘటన కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఎదురైంది. ఈ ఘటన నవంబర్ 12వ తేదీన రిలీజైన టైగర్ 3 సినిమా సందర్భంగా చోటు చేసుకొన్నది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించిన టైగర్
చిత్రంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించారు. ఈ చిత్రంలో షారుక్, హృతిక్ అతిథి పాత్రల్లో నటించారు. దక్షిణాది తారలు రేవతి, సిమ్రాన్ కీలక పాత్రలతో మెప్పించారు. ఇలాంటి సినిమాకు తొలి రోజు అభిమానులు దేశవ్యాప్తంగా పోటెత్తారు.

Salman Khan reacted on Fans Burning Diwali cracker in Tiger 3 Screening Theatre in Malegaon

అయితే మాలేగావ్ అనే ప్రదేశంలో టైగర్ 3 చిత్రానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. సినిమాలో నిమగ్నమై ప్రేక్షకులు చూస్తున్న సమయంలో అభిమానులు ఉన్నట్టుండి దీపావళీ టపాసులు భారీగా పేల్చారు. దాంతో థియేటర్ టాప్‌కు తగిలేలా రాకెట్లు ఎగరడం, అలాగే బాంబులు పేలి ప్రేక్షకులపై నిప్పు రవ్వలు పడటంతో వారు భయంతో పరుగులు పెట్టారు.

థియేటర్‌లో బాంబులు పేల్చిన సంఘటనపై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఏదైనా జరగకూడదని ప్రమాదం జరిగితే భారీగా ప్రాణం నష్టం జరిగే ప్రమాదం ఉండేదని పలువురు సోషల్ మీడియాలో అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాము భయబ్రాంతులకు గురయ్యామని ప్రేక్షకులు తమ ఆందోళనను వ్యక్తం చేశారు.

టైగర్ 3 సినిమా హాల్‌లో బాంబులు కాల్చిన ఘటన, అభిమానుల అత్యుత్సాహంపై సల్మాన్ ఖాన్ తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా స్పందించారు. టైగర్ 3 సినిమాను ప్రదర్శించే సమయంలో అభిమానులు దీపావళీ టపాసులు పేల్చారని విన్నాను. ఇలాంటి చర్యలు అత్యంత ప్రమాదకరం. ఇతరుల ప్రాణాలను ఇబ్బందిలో పడేయకుండా సినిమాను మాత్రం ఎంజాయ్ చేయండి. మీరు సురక్షితంగా దీపావళీని జరుపుకొండి అని సల్మాన్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

టైగర్ 3 సినిమా విషయానికి వస్తే.. తొలి రోజు ఈ మూవీ 45 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద వసూలు చేసింది. రెండో రోజు ఈ సినిమా 25 శాతం వృద్దిని సాధించింది. 2వ రోజున ఈ సినిమా 60 కోటల్ రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో సునాయసంగా చేరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X