రైతుల ఆందోళనపై పెదవి విప్పిన సల్మాన్ ఖాన్.. హాట్ కామెంట్లు చేసిన కండల వీరుడు
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్న రైతుల ఆందోళన అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. రైతన్న ఉద్యమంపై సెలబ్రిటీల తమకు తోచిన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అంతర్జాతీయ సెలబ్రిటీ గ్రేటా, పాప్ సింగర్ రిహన్నా చేసిన వివాదాస్పద కాగా, వారికి భారతీయ సినిమా నటీనటులు అక్షయ్ కుమార్, కరణ్ జోహర్ ఘాటుగా స్పందించారు.
ఈ నేపథ్యంలో ఓ ఈవెంట్‌లో మీడియా అడిగిన ప్రశ్నకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తొలిసారి స్పందించారు. రైతులకు మంచి జరుగుతుందనే పనులను తప్పకుండా చేయాలి. సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కచ్చితంగా సరైన నిర్ణయం తీసుకోవాల్సిందే. దేశానికి, రైతులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం అంతిమ్ అనే చిత్ర షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో సిక్కు మతానికి చెందిన పోలీస్ అధికారి పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయుష్ శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నది.
ఇదిలా ఉండగా, ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ నటించిన రాధే చిత్రం రంజాన్ పండుగ కానుకగా రిలీజ్ కానున్నది. ఇది కాకుండా టైగర్ 2, కిక్ 2, కభీ ఈద్ కభీ దీవాళీ అనే చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











