బాలీవుడ్ అగ్ర హీరో సినిమా నుంచి తప్పుకున్న దేవిశ్రీప్రసాద్.. పుష్ప తరువాత గోల్డెన్ ఛాన్స్ మిస్

రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఇటీవల పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీప్రసాద్ ఎలాంటి సినిమా చేసినా కూడా తప్పకుండా మ్యూజిక్ లో సక్సెస్ అవుతాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల కాలంలో వేరే సినిమాలతో మాత్రం దేవిశ్రీప్రసాద్ అంతగా సక్సెస్ కాలేదు. కేవలం అతనికి పుష్ప సినిమాతోనే భారీ స్థాయిలో క్రేజ్ అయితే అందింది. అంతేకాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు ఆఫర్లు వచ్చాయి.

అయితే దేవి శ్రీ ప్రసాద్ మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ కు తగ్గట్టుగా ఫాలో కాలేను అని కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశాడు. ఒక సినిమాకు వర్క్ చేస్తే పూర్తిస్థాయిలో చేస్తానని చెప్పిన దేవి ఒకటి రెండు పాటలు కంపోజ్ చేసి తప్పుకోలేను అని కొన్ని పెద్ద సినిమాలను మిస్ చేసుకున్నాడు. అయితే మొదటిసారి అతనికి ఒక స్టార్ హీరో మాత్రం పూర్తిస్థాయిలో సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం ఇవ్వడానికి ఇటీవల రెడీ అయినట్లు ఒక టాక్ వినిపించింది.

Salman khan rejected Devi sri prasad tunes and shocking decision

అతను మరెవరో కాదు సల్మాన్ ఖాన్ అని వార్తలు అయితే గట్టిగానే వచ్చాయి. సల్మాన్ ఖాన్ నుంచి త్వరలో రాబోయే కబీ ఈద్ కబీ దివాళి అనే సినిమాకు దేవిశ్రీప్రసాద్ రీసెంట్ గా కొన్ని ట్యూన్స్ కూడా ఇచ్చాడట. అయితే అవన్నీ కూడా అంతగా సంతృప్తి అనిపించకపోవడంతో సల్మాన్ ఖాన్ అతన్ని ప్రాజెక్టు నుంచి తప్పించినట్లుగా కొత్త టాక్ వినిపిస్తోంది. దేవిశ్రీప్రసాద్ బాగానే కష్టపడి ట్యూన్స్ రెడీ చేసిన తర్వాత వాళ్ళకి ఏ మాత్రం కనెక్ట్ కాలేదట. దర్శకుడితో కూడా దీనికి కొన్ని విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తోంది.

దేవిని కాదని సల్మాన్ KGF మ్యూజిక్ డైరెక్టర్ రవి బసృర్ ని సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక ఈ విషయంపై అయితే ఇంకా అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం తెలుగులోనే కొన్ని ప్రాజెక్టులతో దేవి శ్రీ ప్రసాద్ బిజీగా ఉన్నాడు. అలాగే సుకుమార్ తోనే మరోసారి పుష్ప సెకండ్ పార్ట్ కోసం వర్క్ చేయబోతున్నాడు. ప్రస్తుతం థమన్ హవా ఎక్కువగా కొనసాగుతుండటంతో ఇంతకుముందు దేవితో వర్క్ చేసిన దర్శకులు కూడా థమన్ వైపే మొగ్గు చూపుతుండటం విశేషం. మరి దేవి శ్రీ ప్రసాద్ మళ్లీ ఎప్పుడు ఫామ్ లోకి వస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X