ఇప్పటి వరకు ఏ మహిళా పెళ్లి చేసుకో అని అడగలేదు: సల్మాన్ ఖాన్

బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ 53 ఏళ్ల వయసు వచ్చినా... ఇంకా బ్యాచిలర్ గానే జీవితం కొనసాగుతున్నారు. ఆయన పెళ్లి విషయం ఎప్పుడూ హాట్ టాపికే. తాజాగా ఫిల్మ్ ఫేర్ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన ప్రశ్న ఎదురవ్వగా సల్మాన్ ఆసక్తికరంగా స్పందించారు. ఇప్పటి వరకు ఏ మహిళ తన వద్దకు మ్యారేజ్ ప్రపోజల్‌తో రాలేదని వెల్లడించారు.

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో వచ్చిన 'భారత్' చిత్రంలో కత్రినా కైఫ్ పోషించిన క్యారెక్టర్.... సల్మాన్ ఖాన్‌ వద్దకు పెళ్లి ప్రపోజల్‌తో వస్తుంది. అయితే అలాంటి సన్నివేశం నా నిజ జీవితంలో ఎప్పుడూ జరుగలేదని సల్మాన్ తెలిపారు.

Salman Khan revealed that no woman has ever come to him with a marriage proposal

'నా జీవితంలో అలాంటివి ఎప్పుడూ జరుగలేదు.(నవ్వుతూ) ఎందుకంటే నేను ఎప్పుడూ ఎవరితోనూ క్యాండిల్ లైట్ డిన్నర్ చేయలేదు. కొవ్వొత్తి వెలుగులో నేను ఏమి తింటున్నానో చూడలేను. ఎవరూ తన వద్దకు పెళ్లి ప్రపోజల్‌తో రాకపోవడం బాధగా ఉంది' అని సల్మాన్ ఖాన్ తెలిపారు.

సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే... ఆయన నటించిన 'భారత్' చిత్రం ఇటీవల ఈద్ సందర్భంగా విడుదలై మంచి విజయం అందుకుంది. దాదాపు రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం 'దబాంగ్-3'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సోనాక్షి సిన్హా, అర్బాజ్ ఖాన్, ప్రమోద్ ఖన్నా, కిచ్చా సుదీప్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X