నాకు 72 ఏళ్ల వరకు పెళ్లి కాదు.. దీపికా, ప్రియాంక ఇద్దరూ.. సల్మాన్ ఖాన్!
కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లెప్పుడు చేసుకుంటాడో తెలియదు కానీ ప్రతి రోజు అతడికి ఏదో రూపంలో ఈ ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. సల్మాన్ ఖాన్ ఇటీవల కపిల్ శర్మ షోకు హాజరయ్యాడు. కపిల్ శర్మ ఎప్పటిలాగే ఈ షోలో కూడా సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి ప్రస్తావించాడు. కానీ సల్మాన్ ఖాన్ నుంచి మాత్రం ఆసక్తికర సమాధానం వచ్చింది. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం అలీ అబ్బాస్ దర్శత్వంలో భారత్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కు జోడిగా కత్రినా కైఫ్ నటిస్తోంది.

భారత్‌తో బిజీగా ఉండి కూడా
కపిల్ శర్మ మాట్లాడుతూ భారత్ షూటింగ్ తో బిజీగా ఉంది కూడా సల్మాన్ భాయ్ ఈ షోకు వచ్చారు. అందుకు కృతజ్ఞతలు. సల్మాన్ భాయ్.. దీపికా పెళ్లయిపోయింది.. ప్రియాంక పెళ్లైపోయింది.. ఇక మీ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించబోయి భారత్ సినిమా గురించి చెప్పండి అంటూ కపిల్ శర్మ మాట మార్చేశాడు. దీనితో షో మొత్తం నవ్వులు విరిశాయి. సల్మాన్ ఖాన్ కూడా నవ్వేశాడు.
72 ఏళ్ల వరకు పెళ్లి కాదు
ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. భారత్ సినిమాలో కూడా నాకు 72 ఏళ్ల వయసు వరకు పెళ్లి కాదు. ఆ సినిమాని రియల్ లైఫ్ లో కూడా ఫాలో కావాలి కదా అంటూ సల్మాన్ ఖాన్ సరదాగా స్పందించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆదివారం రాత్రి ఈ ఎపిసోడ్ ని ప్రసారం చేశారు. భారత్ చిత్ర కోప్రొడ్యూసర్ అగ్నిహోత్రి ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

చివరి దశలో
భారత్ చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ మరోమారు కనువిందు చేసేందుకు సిద్ధంఅవుతున్నారు. సునీల్ గోవర్, దిశా పటాని, టబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది రంజాన్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదుల చేయనున్నట్లు తెలుస్తోంది.

రొమేనియన్ బ్యూటీతో డేటింగ్
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం రొమేనియన్ బ్యూటీలులియా వంటూర్ తో డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. లులియా సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులతో బాగా కలిసిపోయిందట. ఆ ఇంటి కోడలిలాగానే మేలుగుతోందని వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ బర్త్ డే పార్టీ సందర్భంగా ఇంట్లో అన్ని కార్యక్రమాలు లులియానే చూసుకుందని బాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. సల్మాన్ కు కాస్ట్లీ గోల్డ్ చైన్ గిఫ్ట్ గా ఇచ్చిందట. సల్మాన్ ఖాన్ ఇలాంటి ప్రేమ వ్యవహారాలు ఎన్ని సాగించినా పెళ్లివరకు మాత్రం వెల్ళడం లేదు.


Click it and Unblock the Notifications











