twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ ఖాన్‌కు ప్రాణాంతక జబ్బు.. నొప్పి భరించలేక సూసైడ్ ఆలోచనలతో..

    |

    అనంత విశ్వంలో మన భూమి అనేది చిన్న రేణువు లాంటిది. అలాంటి రేణువులో ఉన్న మనం ఇంకా ఎలా లెక్కించబడతామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ భూమి మీద ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయో అన్ని రకాల వ్యాధులు ఉన్నాయి. ఇక ఈ విషయం అంత ఇప్పుడు ఎందుకు అంటే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ఒక వింత వ్యాధి ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వ్యాధి పేరు మాత్రమే కాదు దాని లక్షణాలు కూడా వింతగానే ఉన్నాయి. ఆయనకు సోకిన వ్యాధి పేరు ఏంటి? ఆ వ్యాధి లక్షణాలు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే

    ట్రైజెమినల్ న్యూరాల్జియా

    ట్రైజెమినల్ న్యూరాల్జియా


    సల్మాన్ ఖాన్ కు వింత వ్యాధి ఉన్న సంగతి చాలా సంవత్సరాల క్రితమే బయట పడింది. అప్పట్లో ఆయన తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్మోకింగ్ మానేసినట్లు ఒప్పుకున్నాడు. ఆమె గత కొన్నేళ్లుగా ట్రైజెమినల్ న్యూరాల్జియాతో సల్మాన్ బాధపడుతున్నారు. 'బాడీగార్డ్' సినిమా విడుదల సమయంలో అంటే 2011 ఆగస్టు నెలలో భరించలేని నొప్పి కారణంగా దాని సర్జరీ కోసం లాస్ ఏంజెల్స్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ సర్జరీ చేసినా.. సల్మాన్ ఖాన్ కు డాక్టర్ చాలా జాగ్రత్తలు చెప్పారు.

    తలపై కూడా

    తలపై కూడా


    ఆ తరువాత కూడా మరోమారు ఈ వ్యాధి ఆయనను ఇబ్బంది పెట్టింది. దీంతో ఈ వ్యాధికి చికిత్స పొందడానికి సల్మాన్ అమెరికా కూడా వెళ్లారు. ఈ ట్రైజెమినల్ న్యూరాల్జియా అనేది మనిషి ముఖ నరాల నుంచి ప్రారంభమయ్యే వ్యాధి. ఇది మనిషి తలపై కూడా ప్రభావం చూపుతుంది. ఒక రకంగా ఇది నాడీ సంబంధిత రుగ్మత, దీనిలో భరించలేని నొప్పి ఒక విద్యుత్ షాక్ లాగా అనిపిస్తూ ఉంటుంది.

    బ్రష్‌ చేసుకున్నా

    బ్రష్‌ చేసుకున్నా


    తాజాగా ఈ విషయాన్ని సల్మాన్‌ ట్యూబ్‌లైట్‌ అనే పాట ఆవిష్కరణ కార్యక్రమంలో వెల్లడించాడు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సల్మాన్‌ మాట్లాడుతూ.. తాను ట్రైజెమినల్‌ న్యూరాల్జియా తీవ్ర నరాల బలహినతతో బాధపడ్డానని గుర్తు చేస్తున్నారు. 'ఈ వ్యాధి వల్ల నేను ఎక్కువ సేపు మాట్లాడలేక పోయేవాడినన్న ఆయన మాట్లాడితే నా ముఖ భాగం చాలా నొప్పిగా అనిపించి మూతి వంకర పోతుందని అన్నారు. బ్రష్‌ చేసుకున్నా, మేకప్‌ వేసుకున్న నొప్పి తీవ్రంగా ఉండేది' అని చెప్పుకొచ్చాడు.

     ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన

    ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన


    ఇక రాత్రి సమయంలో ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉండేది, ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చేదని సల్మాన్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నానని, దీని కోసం అమెరికాలో చికిత్స తీసుకుంటున్నట్లు కూడా సల్మాన్‌ తాజాగా వెల్లడించారు.

     దంత సమస్య అనుకుని

    దంత సమస్య అనుకుని


    ఈ వ్యాధి నొప్పి భరించలేనంతగా ఉంటుందట, అందుకే దీనిని ఆత్మహత్య వ్యాధి అని కూడా పిలుస్తారు. నొప్పి భరించలేక సదరు వ్యక్తి చివరికి ఆత్మహత్య చేసుకుంటాడు. తొలిదశలో, ఈ వ్యాధిని గుర్తించరు ఎందుకంటే నొప్పి దంతాలతో మొదలవుతుంది. ఇక నొప్పి అదే విధంగా ఉంటుంది కాబట్టి, వచ్చిన వారు దీనిని దంత సమస్యగా భావిస్తారు.

    English summary
    Salman Khan reveals that he Suffered With Trigeminal Neuralgia Disease.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X