twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్‌కు మరో షాక్.. చంపుతామని న్యాయవాదికి బెదిరింపులు.. ఆశారాంతో తొలి రోజు ఇలా..

    By Rajababu
    |

    Recommended Video

    కండల వీరుడిని మట్టి కరిపించిన 'బిష్ణోయ్': ఎందుకింతలా పోరాడారు..!

    కృష్ణజింకల వేట కేసులో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు మరో షాక్ తగిలింది. ఈ కేసులో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కోర్టు గురువారం ఐదేళ్ల శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించిన సంగతి విదితమే. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎగువ కోర్టుకు అప్పీల్ చేసుకోవాలని సల్మాన్ తరఫు న్యాయవాది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్‌కు బెయిల్ ఇవ్వాలని రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. 1998లో హమ్ సాథ్ సాథ్ హై చిత్ర షూటింగ్ సందర్భంగా కృష్ణ జింకలను వెటాడినట్టు సల్మాన్‌తోపాటు టబు, సైఫ్ ఆలీఖాన్, నీలం, సొనాలి బింద్రేలపై కేసు నమోదైంది. ఈ కేసులో సైఫ్, టబు, సొనాలీ, నీలంను జోధ్‌పూర్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

    మరో రోజు జైలులోనే

    మరో రోజు జైలులోనే

    కోర్టు తీర్పు అనంతరం బెయిల్ లభించకపోవడంతో సల్మాన్ ఖాన్ జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో గురువారం రాత్రి గడిపాడు. శుక్రవారం కూడా బెయిల్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో మరో రోజు కూడా సల్మాన్ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    సాధారణ ఖైదీలానే

    సాధారణ ఖైదీలానే

    సల్మాన్‌ను సాధారణ ఖైదీలాగే చూస్తున్నాం. ఆయన సెల్‌లో మామూలు చెక్కమంచం, కూలర్, రగ్గు తప్ప ఇంకేమీ లేవు. గురువారం రాత్రి సల్మాన్‌కు అందరు ఖైదీల్లాగే చపాతీ, పప్పు ఇచ్చాం అయితే జైలుకు వచ్చేసరికే సల్మాన్ రక్తపోటు (బీపీ)తో బాధపడుతున్నారు అని జైలు అధికారి విక్రమ్‌సింగ్ మీడియాకు తెలిపారు. ఆయన చెప్పారు. తొలిరోజు జైల్లో భోజనం తినేందుకు సల్మాన్ తిరస్కరించినట్లు సమాచారం.

    మూడుసార్లు జోధ్‌పూర్

    మూడుసార్లు జోధ్‌పూర్

    జోధ్‌పూర్ జైలులో సల్మాన్ గడపడం ఇదే మొదటిసారి కాదు. ఈ కేసుల్లోనే ఆయన మూడు పర్యాయాలు మొత్తం 18రోజులపాటు జైల్లో ఉన్నారు. 1998లో కేసు నమోదైన 10 రోజుల తర్వాత అక్టోబర్ 12న అటవీ అధికారులు సల్మాన్‌ను అరెస్టు చేశారు. న్యాయస్థానం ఆయనను అక్టోబర్ 17వరకు రిమాండ్‌కు పంపింది. 2006 ఏప్రిల్ 10న ట్రయల్ కోర్టు ఐదేండ్ల జైలుశిక్ష విధించగా, ఆరురోజులపాటు జోధ్‌పూర్ జైల్లో ఆయన శిక్ష అనుభవించారు. మరోకేసులో 2007 ఆగస్టు 26నుంచి 31వరకు ఆరురోజులపాటు సల్మాన్ జైలులో ఉన్నారు.

    ఖైదీ నంబర్ 106 కేటాయింపు

    ఖైదీ నంబర్ 106 కేటాయింపు

    జోధ్‌పూర్ కోర్టు తీర్పు తర్వాత సల్మాన్ ఖాన్‌ను స్థానిక సెంట్రల్ జైలుకు తరలించారు. భద్రతా పరిస్థితుల దృష్ట్యా సల్మాన్‌కు ప్రత్యేక గదిని కేటాయించారు. ఆయనకు ఖైదీ నంబర్ 106 అనే సంఖ్యను ఇచ్చారు. మహిళలపై వేధింపులకు పాల్పడిన కేసులో శిక్షను అనుభవిస్తున్న అధ్యాత్మిక గురువు ఆశారాం బాపు ఉంటున్న వార్డులోనే సల్మాన్ గదిని కేటాయించారు.

    జైలు ఎదుట భారీగా అభిమానులు

    జైలు ఎదుట భారీగా అభిమానులు

    జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు సల్మాన్ ఖాన్‌ను తరలించినట్టు వార్త వెలువడిన వెంటనే అక్కడికి పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకొన్నారు. సల్మాన్ ఫొటోల కూడిన ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఇదిలా ఉండగా ముంబైలోని సల్మాన్ ఇంటి వద్దకు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో చేరుకొన్నారు.

    న్యాయవాదికి బెదిరింపులు

    న్యాయవాదికి బెదిరింపులు

    సల్మాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించిన న్యాయవాది మహేష్ బోరాకు చేదు అనుభవం ఎదురైంది. సల్మాన్‌కు శిక్ష పడిన నేపథ్యంలో గుర్తు తెలియన వ్యక్తులు, పలువురు అభిమానులు బోరాను బెదిరిస్తూ ఎస్సెమ్మెస్‌లు, ఫోన్స్‌కాల్స్ చేశారు. తనకు హాని తలపెడుతామని బెదిరించినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు.

    English summary
    The Jodhpur Court will on Friday (April 6) reserved the order on Salman Khan's bail for tomorrow. This means that Khan will have to stay in jail even today. Khan was sentenced to five years jail in blackbuck poaching case yesterday. Salman Khan's lawyer had filed the bail application in the court today. Salman Khan was taken to Jodhpur Central Jail on Thursday evening, hours after he was convicted in the blackbuck poaching case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X