Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విజువల్ డిలైట్: అంచనాలు పెంచేసిన సల్మాన్ ఖాన్ ‘భారత్’ ట్రైలర్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి బాక్సాఫీసును షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన నటిస్తున్న తాజా మూవీ 'భారత్' ఈద్ సందర్భంగా జూన్ 5న విడుదలవుతున్ననేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు. ఇందులో భాగంగా సోమవారం ట్రైలర్ విడుదల చేశారు.
3 నిమిషాల 11 సెకండ్ల నిడివిగల ట్రైలర్ 'భారత్' మూవీపై అంచనాలు మరింత పెంచేసింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్, డ్రమటిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసే విధంగా ఉంది. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన వ్యక్తిగా సల్మాన్ ఖాన్ కనిపించబోతున్నారు.
విభిన్నమైన పాత్రల్లో సల్మాన్ ఖాన్
‘భారత్' చిత్రంలో సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు ఏ సినిమాలో చేయని విధంగా మల్టిపుల్ అవతారాల్లో కనిపించబోతున్నారు. సల్లూ భాయ్ అభిమానులకు ఈ మూవీ నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
దిశాపటానీ గ్లామర్
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గ్లామరస్ అవతారంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్, దిశా పటానీ మధ్య వచ్చే సన్నివేశాలు, పాటలను కమర్షియల్ మసాలా దట్టించి అభిమానులకు వినోదం పంచే విధంగా ఉంటాయని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
కత్రినా కైఫ్ డీ గ్లామరస్ రోల్
ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు భిన్నంగా కత్రినా కైఫ్ ఇందులో డీ గ్లామరస్ పాత్రలో... పెర్ఫార్మెన్స్ బేస్డ్ రోల్లో కనిపించబోతోంది. ఇందులో ఆమె గవర్నమెంట్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. సల్మాన్, కత్రినా మధ్య వచ్చే ప్రేమ, పెళ్లి సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నాయి.
వీరి పాత్రలు ఆసక్తికరమే
కపిల్ కామెడీ షో ఫేం సునీల్ గ్రోవర్ సల్మాన్ ఖాన్ స్నేహితుడి పాత్రలో నవ్వులు పూయించబోతున్నాడని స్పష్టమవుతోంది. సల్మాన్ తండ్రి పాత్రలో జాకీ ష్రాఫ్ నటిస్తుండగా, సోనాలి కులకర్ణి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓ పాటలో నోరా ఫతేహి సల్మాన్ ఖాన్‌తో ఆడిపాడింది.
విజువల్ డిలైట్
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ చూసిన తర్వాత ‘భారత్' మూవీ ఒక విజువల్ డిలైట్గా ఉంటుందనే విషయం స్పష్టమవుతోంది. స్వాతంత్రం రాక ముందు సంఘటనలు, ఇండిపెండెన్స్, దేశ విభజన నాటి పరిస్థితులను ఇందులో ఫోకస్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్నారు.