బాటిల్ క్యాప్ ఛాలెంజ్.. వెరైటీగా స్పందించిన సల్మాన్.. హోరెత్తుతున్న కామెంట్స్
గత కొంత కాలంగా సోషల్ మీడియాలో పలు రకాల ఛాలెంజ్‌లు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు ఛాలెంజ్ పేరిట ఒక ఫీట్ చేయడం, దాన్ని తిరిగి సోషల్ మీడియా వేదికగా మరొకరికి ఛాలెంజ్ విసరడం.. ఆ తరువాత వారు కూడా అదే ఫీట్ చేసి ఇంకొకరికి విసరడం.. ఇలా ఒక్కొక్కరుగా అందరూ ఇందులో భాగమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వైరల్ అవుతున్న ఛాలెంజ్ బాటిల్ క్యాప్ ఛాలెంజ్. నీళ్లున్న బాటిల్‌ను టేబుల్‌పై ఉంచి దాని మూతను కాలు పైకెత్తి తన్నడమా అనేది కాన్సెప్ట్.

ఇప్పటికే ఈ ఛాలెంజ్ చాలా మంది సెలబ్రిటీలు చేసేశారు కూడా. అయితే అలా అలా తిరిగి తిరిగి బాటిల్ క్యాప్ ఛాలెంజ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దగ్గరకు వచ్చింది. దీంతో ఆ ఛాలెంజ్ స్వీకరించిన ఆయన వెరైటీగా రియాక్ట్ అయి విమర్శకుల చేత కూడా భేష్ అనిపించుకున్నాడు. బాటిల్‌ని క్యాప్‌ని తన్నుతున్నట్లుగానే బిల్డప్ ఇచ్చి మెల్లగా దగ్గరకొచ్చి గాలి ఊది బాటిల్ క్యాప్ తీసి ఆ నీటిని తాగేశాడు సల్మాన్ ఖాన్. పైగా ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ''నీటిని తన్నొద్దు.. త్రాగండి'' అని కామెంట్ చేశాడు.
దీంతో సల్మాన్ ఖాన్ చేసిన ఈ ట్వీట్ కొన్ని నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయింది. దేశంలో ఎందరో నీళ్ల సమస్యతో అల్లాడిపోతుంటే ఇలా నీటిని తన్నడం సరికాదని పేర్కొంటూ సల్మాన్ చర్యను ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. ఈ మేరకు అరుణాచల్ మంత్రి కిరం రిజిజు స్పందిస్తూ ''సల్మాన్ నువ్వు ది బెస్ట్ అని నిరూపించుకున్నావు'' అని ట్వీట్ చేశాడు. బాటిల్ క్యాప్ ఛాలెంజ్ పై సల్మాన్ ఖాన్ ప్రవర్తించిన తీరు నెటిజన్లు ఆకట్టుకుంటోంది. అంతేకాదు దీన్ని మిగిలిన సెలబ్రిటీలు కూడా ఆదర్శంగా తీసుకోవాలంటూ రియాక్ట్ అవుతున్నారు జనం.


Click it and Unblock the Notifications











