మరో వివాదంలో సల్మాన్ ఖాన్.. కండలవీరుడి మెడకు ‘శివలింగం’ ఉచ్చు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దంబంగ్ 3 సినిమా షూటింగ్ మొదలుపెట్టారో లేదో వివాదాలు చుట్టుముట్టాయి. శివలింగంను అగౌరవపరిచారంటూ హిందూ మతానికి చెందిన ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ గొడవలో కాంగ్రెస్, బీజేపీ జోక్యం చేసుకోవడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం మధ్య ప్రదేశ్‌లోని మహేశ్వర్‌లో జరుగుతున్న షూటింగ్‌లో అసలేం జరిగిందంటే...

శివలింగంపై కర్ర చెక్కలు వేశారని

శివలింగంపై కర్ర చెక్కలు వేశారని

దంబంగ్ 3 సినిమా షూటింగ్‌లో భాగంగా శివలింగం ఫొటోలపై కర్ర చెక్కలను పెట్టడం వివాదానికి కారణమైంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో స్వైర విహారం చేయడంతో ఈ సంఘటనకు రాజకీయ రంగు పులుముకున్నది. ఈ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం జరగడంతో వివాదంగా మారింది.

మనోభావాలను కించపరిచారని

మనోభావాలను కించపరిచారని

హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా రాష్ట్రంలో సంఘటనలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో దంబంగ్ సినిమా షూటింగ్‌లో శివలింగంను అవమానించే విధంగా షూటింగ్ సిబ్బంది వ్యవహరించారు. వారిపై కేసు నమోదు చేయాలని బీజేపీ వర్గాలు డిమాండ్ చేశాయి.

 రాజకీయాలు చేయొద్దని

రాజకీయాలు చేయొద్దని

బీజేపీ నేతలు కుంచిత స్వభావంతో వ్యవహరిస్తున్నారు. వారి ఆరోపణలకు, డిమాండ్లకు స్పందించాల్సిన అవసరం లేదు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయవద్దు. సున్నితమైన విషయాలను వివాదంగా మార్చవద్దు అని హితవు పలుకుతూ కాంగ్రెస్ నేతలు స్పందించారు.

శివలింగంకు అడ్డంగా కర్ర చెక్కలు

శివలింగంకు అడ్డంగా కర్ర చెక్కలు

పవిత్ర శివలింగంపై ఎలాంటి వస్తువులు పడకుండా కర్ర చెక్కలను సిబ్బంది అడ్డంగా ఉంచారు. ఆ తర్వాత వాటిని తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచారు అని స్థానిక మీడియా కథనాన్ని ప్రసారం చేసింది. మూడు రోజులు దంబంగ్ మూవీ షూటింగ్ జరుగుతుండగా సల్మాన్ ఖాన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గురువారం నుంచి సోనాక్షి సిన్హా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X