తెలుగులో విడుదల కాబోతున్న సల్మాన్ ఖాన్ సినిమా.. కెరీర్‌లో ఇదే తొలిసారి
ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఉన్న హీరోల్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎంతో ప్రత్యేకం అని చెబుతుంటారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న ఈ సీనియర్ హీరోకు మగ అభిమానులతో పాటు భారీ స్థాయిలో లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. దీంతో అతడికి భారీ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే సల్మాన్ సినిమాలకు భారీ రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అందుకే సల్మాన్ ప్రతి సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరిపోతూ వస్తోంది. దీంతో అతడు రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.
ఈ క్రమంలోనే తనకు 'వాంటెడ్'తో భారీ విజయాన్ని అందించిన ప్రభుదేవాతో సల్మాన్ మరోసారి జత కట్టాడు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో 'దబాంగ్ 3' తెరకెక్కుతోంది. ఇందులో సల్మాన్ సరసన సోనాక్షి సిన్హా నటిస్తోంది. గతంలో వచ్చిన 'దబాంగ్ 2'కు ఇది సీక్వెల్‌గా వస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికితోడు ఇప్పటికే 'దబాంగ్' పేరిట వచ్చిన రెండు సినిమాలు భారీ విజయాన్ని దక్కించుకోవడంతో ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది.

అందుకే 'దబాంగ్ 3'ని హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే తెలుగు వెర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సల్మాన్ సినిమా దక్షిణాదిలో విడుదల కావడం ఇదే తొలిసారి. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. 'దబాంగ్ 3' డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో సల్మాన్ ఖాన్ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. ఈ సినిమాతో పాటు అతడు 'కిక్2', 'ఇన్‌షాఅల్లా' చిత్రాలతో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











