అలారమే బతికించింది.. భూకంపం నుంచి తప్పించుకున్న స్టార్ హీరో లవర్
బాలీవుడ్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సల్మాన్ ఖాన్.. లులియా వాంటర్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో బాలీవుడ్‌తో పాటు దేశ వ్యాప్తంగా తెలిసిపోయింది. ఈ విషయంపై సల్మాన్ కూడా గతంలో బహిరంగంగానే స్పందించాడు. దీంతో వీళ్ల మధ్య వ్యవహారం బీ టౌన్‌లో హాట్ టాపిక్ అయింది. తాజాగా లులియా వాంటర్ ఓ భారీ ప్రమాదం గురించి తప్పించుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
ప్రస్తుతం లులియా వాంటర్ బాలిలో ఉంది. అక్కడ నిన్న తెల్లవారుజామున భూకంపం వచ్చింది. అయితే, ఈ ప్రమాదం నుంచి ఆమె తప్పించుకుంది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. "జీవితానికి మేల్కొలపండి !!! ఈరోజు ఉదయం అలారం మ్రోగడంతో నిద్రలేచాను. ప్రస్తుతం నేను బాలిలో ఉన్నాను. ఇక్కడ 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. కొద్ది సెకన్లలోనే వేలాది ఆలోచనలు నా మనస్సును వణికించాయి. కానీ, నేను ప్రశాంతంగా, విశ్వాసంతో ఉండాలని నిర్ణయించుకున్నాను'' అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే, ''చెడు ఏమీ జరగదని నేను స్పష్టంగా భావించాను. దేవునికి ధన్యవాదాలు. ఈసారి ఎవరూ గాయపడలేదు. అన్నీ కొద్ది నిమిషాల్లోనే సాధారణ స్థితికి చేరుకున్నాయి. కొన్నిసార్లు మనకు రిమైండర్ అవసరం! జీవితం ఇంత మాత్రమే ఉంటుంది !!! కాబట్టి ... దాన్ని ఆస్వాదించండి. దాన్ని ఎక్కువగా ఉపయోగించుకోండి'' అని ఆమె రాసుకొచ్చింది. దీనితో పాటు కొన్ని వీడియోలను సైతం ఆమె పోస్ట్ చేసింది.
గతంలో సల్మాన్ లవర్ లులియా వాంటర్‌తో కలిసి కారులో ప్రయాణించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. వారిద్దరు కలిసి బాంద్రాలో కారులో వెళ్తుండగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేశాయి. ఆ సమయంలో సల్మాన్, వెంకీ ఇద్దరు కలిసి ఓ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారని అందులో భాగంగానే లులియాను మన హీరో కలిశాడని వార్తలు వచ్చాయి. మరోవైపు, వెంకీ బాలీవుడ్‌లో నటిస్తున్నాడని అందుకే సల్మాన్ భాయ్‌ని కలవడానికి వెళ్లాడని, ఆసమయంలోనే లులియాను కలిశాడని కూడా ప్రచారం జరిగింది.


Click it and Unblock the Notifications











