For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Salman Khan మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్.. పవన్ రీమేక్ చిత్రంలో వెంకటేష్, జగపతి బాబు!

  |

  బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కిసి కా భాయ్, కిసీ కా జాన్ చిత్రం. ఈ సినిమా టైటిల్ ప్రకటనను చిత్ర యూనిట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

  కాటమరాయుడు రీమేక్‌గా

  కాటమరాయుడు రీమేక్‌గా

  Kisi Ka Bhai Kisi Ki Jaan చిత్రం తమిళంలో విజయవంతమైన అజిత్ చిత్రం వీరమ్, తెలుగులో సక్సెస్‌ఫుల్ చిత్రం కాటమరాయుడు సినిమా ఆధారంగా రూపొందుతున్నది. ఈ సినిమా ఎక్కువ శాతం హైదరాబాద్, గోదావరి జిల్లాల్లో షూటింగు జరుపుకొన్నది. ఈ సినిమాకు బచ్చన్ పాండేకు దర్శకత్వం వహించిన ఫర్హద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

  సోషల్ మీడియా స్టార్స్ సోదరులుగా

  సోషల్ మీడియా స్టార్స్ సోదరులుగా

  సల్మాన్ ఖాన్‌కు సోదరులుగా Kisi Ka Bhai Kisi Ki Jaan చిత్రంలో పలువురు టాప్ సోషల్ మీడియా ఇన్ల్పూయెన్సర్లను బరిలోకి దించారు. ఉత్తరాదిలో మంచి పాపులారిటీ ఉన్న సోషల్ మీడియా స్టార్స్.. సుల్, అబ్దుల్ రోజిక్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు ఉత్తరాదిలో మంచి క్రేజ్ లభించే అవకాశం ఉంది.

  టైటిల్ మార్చేసిన సల్మాన్ ఖాన్

  టైటిల్ మార్చేసిన సల్మాన్ ఖాన్

  కాటమరాయుడు సినిమా రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు తొలుత కబీ ఈద్.. కభీ దీవాళీ అనే పేరును ఖరారు చేశారు. అయితే ఈ సినిమా పేరును మార్చి కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ అనే పేరును తాజాగా ఖరారు చేసి మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా టైటిల్‌ రిలీజ్ కాగానే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.

   విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో

  విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో

  Kisi Ka Bhai Kisi Ki Jaan సినిమా ద్వారా విక్టరీ వెంకటేష్ మరోసారి బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. గతంలో యమలీల, చంటీ రిమేక్ ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. Ki Ka Bhai Kisi Ki Jaan చిత్రంలో వెంకటేష్ ఓ కీలక పాత్రలో సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించనున్నారు.

  Ki Ka Bhai Kisi Ki Jaan రిలీజ్ ఎప్పుడంటే?

  Ki Ka Bhai Kisi Ki Jaan చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపించనున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మాళవిక శర్మ, జెస్సీ గిల్ తదితరులు నటిస్తున్నారు. అయితే మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఓ అతిథి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఈ చిత్రం డిసెంబర్ 30, 2022 తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది.

  English summary
  Bollywood Super Star Salman Khan's Kisi Ka Bhai Kisi Ki Jaan title unveiled by film Unit. This movie set to release on December 30th, 2022.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X