సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం.. రూమర్లను ఖండించిన ఖాన్ కుటుంబం

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంట్లో పెను విషాదం చోటుచేసుకోన్నది. సల్మాన్‌కు అత్యంత ఇష్టమైన, ఆయన మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ (38 సంవత్సరాలు) ఆకస్మిక మృతి చెందండంతో కుటుంబం తీవ్ర దిగ్బ్రాంతికి లోనవుతున్నది. తన మేనల్లుడి మృతిని సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. అలాగే అబ్దుల్లా ఖాన్ మృతిపై వస్తున్న రూమర్లను కూడా కుటుంబ సబ్యులు ఖండించారు. అబ్దుల్లా మృతి గురించి వివరాల్లోకి వెళితే..

కొద్దికాలంగా మధుమేహంతో

కొద్దికాలంగా మధుమేహంతో

గత కొద్దికాలంగా అబ్దుల్లా డయాబెటిక్ వ్యాధితో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురి కావడంతో ముంబైలోని ధిరూభాయ్ కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో స్వయంగా సల్మాన్ ఖాన్ తన మేనల్లుడిని మెరుగైన చికిత్స కోసం ముంబై బాంద్రాలోని లీలావతి హాస్పిటల్‌కు తరలించారు.

లీలావతి హాస్పిటల్‌లో

లీలావతి హాస్పిటల్‌లో

అయితే లీలావతి హాస్పిటల్‌లో అబ్దులా ఆరోగ్యం కోసం వైద్యులు తీవ్రంగా కృషి చేశారు. కానీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. అనారోగ్యం కారణంగా అబ్దులా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు అని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కుటుంబానికి అత్యంత ఇష్టమైన వ్యక్తి దూరం కావడంతో సల్మాన్ కుటంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

సల్మాన్ ఖాన్ ట్వీట్

సల్మాన్ ఖాన్ ట్వీట్

తన మేనల్లుడి మరణం గురించి మార్చి 31వ తేదీన అర్ధరాత్రి సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. నీ మరణం మాకు ఎనలేని విషాదాన్ని మిగిల్చింది. ఎప్పుడూ మా హృదయాల్లోనే ఉంటావు అని సల్మాన్ ట్వీట్ చేశారు. అబ్దుల్లా సినీ పరిశ్రమకు సంబంధంలేకపోయినా సల్మాన్ ఖాన్ పలుమార్లు ఆయన వీడియోలను, ఫోటోలను తన ట్విట్టర్‌లో షేర్ చేసి తనతో ఉన్న అనుబంధాన్ని వ్యక్తం చేసేవారు.

సల్మాన్ ఖాన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో

గతేడాది జూన్‌లో సల్మాన్ ఖాన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో అబ్దుల్లాతో కూడిన ఓ వీడియోను పోస్టు చేశారు. అత్యంత భారీకాయుడైన అబ్దుల్లాను తన భుజంపై ఎక్కించుకొని.. ఇండియాలో నేను అత్యంత బలశాలుడినని భావిస్తాను. కానీ అబ్దుల్లా నాకంటే బలశాలి అని ఓ కామెంట్‌ను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

సల్మాన్ ఖాన్ గురించి అబ్దుల్లా

ఈ ఏడాది జనవరిలో అబ్దుల్లా కూడా తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేశారు. ఇండియాలో సల్మాన్ ఖాన్ స్ట్రాంగ్.. కానీ ఆయన కంటే వాస్తవంగా నేనే బలవంతుడిని. నిజానికి శక్తి అనేది మా రక్తంలోనే ఉంది. నేను నీకంటే ఎక్కవ బలవంతుడినైనా నా బాస్ నువ్వే. ఖాన్ కుటుంబంలో అత్యంత బలవంతుడివి నువ్వే అని అబ్దుల్లా తన అకౌంట్‌లో పేర్కొన్నారు.

Recommended Video

World Wild Life Day 2020 : Celebrities Love Towards Wild Life
 కరోనా కాదు.. గుండె సంబంధిత వ్యాధితో

కరోనా కాదు.. గుండె సంబంధిత వ్యాధితో

అబ్దుల్లా మరణంపై మీడియాలో అనేక రూమర్లు వచ్చాయి. కరోనావైరస్ కారణంగా మరణించారనే వార్తను సల్మాన్ ఖాన్ కుటుంబం ఖండించింది. హృదయ సంబంధిత వ్యాధితోనే ఆయన మరణించారు. గత కొద్దికాలంగా అబ్దుల్లా మధుమేహం వ్యాధి కూడా బాధపడుతున్నారు అని అబ్దుల్లా మరణంపై సల్మాన్ ఖాన్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X