100 కోట్లవైపు రేస్3.. రివ్యూలను లెక్కచేయని సల్మాన్ స్టామినా
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన రేస్3 చిత్రం రంజాన్ పండుగను పురస్కరించుకొని జూన్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంపై సినీ విమర్శకులు పెదవి విరుస్తున్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నది. తొలిరోజే ఈ చిత్రం 29.17 కోట్లు వసూలు చేసింది.
గతంలో ఈద్ సందర్భంగా విడుదలైన సల్మాన్ చిత్రాలను ఓసారి పరిశీలిస్తే.. 2010లో దంబంగ్ రూ.14.50 కోట్లు, 2001లో బాడీగార్డ్ రూ.21 కోట్లు, 2012లో ఏక్ థా టైగర్ 32.92 కోట్లు, 2014లో కిక్ రూ.26 కోట్లు, 2015లో భజరంగీ భాయ్‌జాన్ 27.25 కోట్లు, సుల్తాన్ చిత్రం కోట్లు వసూలు చేశాయి.

సల్మాన్ రేస్3పై మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ ఈ చిత్రం వారాంతానికి 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. రెమో డీసౌజా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జాక్వలైన్ ఫెర్నాండేజ్, అనిల్ కపూర్, బాబీ డియోల్, డైసీ షా తదితరులు నటించారు.
salman khan race3 jacqueline fernandez bobby deol abbas mustan remo dsouza సల్మాన్ ఖాన్ రేస్3 జాక్వలైన్ ఫెర్నాండేజ్ బాబీ డియోల్ అబ్బాస్ మస్తాన్ రెమో డిసౌజా


Click it and Unblock the Notifications