Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సల్మాన్ ఖాన్ ‘రాధే’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటన: మెగాస్టార్‌ను ఢీకొట్టబోతున్నాడుగా!
దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాలో తన మార్కును చూపిస్తూ దూసుకుపోతున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. పేరుకు హిందీ పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. అన్ని భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్న అతడు.. మార్కెట్‌ను కూడా విస్తరించుకున్నాడు. అదే సమయంలో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు మజాను పంచుతున్నాడు. ఇదే క్రమంలోనే ప్రస్తుతం అతడు 'రాధే' అనే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది యూనిట్.
దక్షిణాది స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న చిత్రమే 'రాధే: ద మోస్ట్ వాంటెడ్ భాయ్'. 'వాంటెడ్', 'దబాంగ్ 3' తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయినప్పటికీ.. కరోనా లాక్డౌన్ కారణంగా విడుదల ఆలస్యం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీంతో సల్లూ భాయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కండల వీరుడు సల్మాన్ ఖాన్ కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'రాధే'లో మేఘా ఆకాశ్, దిశాపటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రణ్ దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి, సోహైల్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు. ఇదిలా ఉండగా.. మే 13న మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న 'ఆచార్య' కూడా విడుదల కాబోతుంది. ఇది పాన్ ఇండియా సినిమా కానప్పటికీ.. రెస్టాఫ్ ఇండియాలో ఈ రెండు చిత్రాలు పోటీ పడే అవకాశం ఉంది.