‘రాధే’ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్: అల్లు అర్జున్ పాటను రిలీజ్ చేస్తున్న సల్మాన్ ఖాన్
బాలీవుడ్ టాప్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం 'రాధే: ద మోస్ట్ వాంటెడ్ భాయ్'. కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా ఈ సినిమాను రూపొందించాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇక, ఈ మధ్య పరిస్థితులు చక్కబడడంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. అదే సమయంలో ఇటీవలే దీని ట్రైలర్‌ను కూడా వదిలారు. అందులో అల్లు అర్జున్ పాటను ఈ చిత్రం కోసం వాడినట్లు చూపించారు. ఇప్పుడిదే సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు.
సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'రాధే'కు తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ - పూజా హెగ్డే జంటగా నటించిన 'డీజే.. దువ్వాడ జగన్నాథమ్' సినిమాలోని సీటీమార్.. సీటీమార్ అనే పాటను ఇందులో రీమిక్స్ చేశాడు. దీన్నే ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌లో చూపించారు. ఇక, ఈ ఫుల్ సాంగ్‌ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు దిశా పటానీ డ్యాన్స్ చేస్తున్న ఓ పోస్టర్‌ను కూడా వదిలింది. దీంతో ఇది ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి కనిపిస్తోంది.

ముంబైలోని డ్రగ్స్ మాఫియా నేపథ్యంతో సాగే 'రాధే' సినిమాలో సల్మాన్ ఖాన్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా నటిస్తున్నాడు. ఇక, ఈ సినిమాలో మేఘా ఆకాశ్, దిశాపటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రణ్ దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి, సోహైల్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు. 2017లో వచ్చిన కొరియన్ సినిమా 'ద ఔట్ లాస్' అనే సినిమాకు 'రాధే' రీమేక్‌గా వస్తోంది.


Click it and Unblock the Notifications











