సల్మాన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి.. రాధే రిలీజ్‌పై తీవ్ర వ్యతిరేకత
ప్రతీ ఏడాది ఈద్ అంటే రంజాన్ పండుగకు సల్మాన్ ఖాన్ తన మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనవాయితీగా మారింది. కోవిడ్ సమయంలో కూడా బాలీవుడ్ కండలవీరుడు తాను నటించిన రాధే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. అయితే ఈ ఈద్‌కు సల్మాన్ అభిమానుల ముందుకు రాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.. ఆ వివరాల్లోకి వెళితే..
అమేయ (అనన్య) క్యూట్ అండ్ గ్లామరస్ ఫొటోస్

రాధే రిలీజ్ వాయిదా వేయాలంటూ
రంజాన్ పండుగను పురస్కరించుకొని సల్మాన్ ఖాన్ తన రాధే చిత్రాన్ని ఒకేసారి థియేటర్లలోను, అలాగే ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు. అందుకు తగినట్టే ట్రైలర్, పాటలను రిలీజ్ చేస్తూ ప్రమోషన్ జోరును పెంచారు. అయితే ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతుండటం వల్ల రాధే రిలీజ్‌ను వాయిదా వేయాలనే డిమాండ్ ఎక్కువుతున్నది.

చేతులెత్తేసిన డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు
రాధే రిలీజ్‌కు పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో సింగిల్ థియేటర్ ఓనర్లు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు చేతులు ఎత్తేసినట్టు తెలిసింది. గత కొద్ది రోజులుగా నిర్మాతలు, చిత్ర యూనిట్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపినట్టు సమాచారం. కరోనావైరస్ విజృంభిస్తున్నందున సినిమా విడుదలను వాయిదా వేయడమే ఉత్తమం అనే వాదనను తెరపైకి తెచ్చినట్టు తెలుస్తున్నది.

సల్మాన్ నిర్ణయంపై అసంతృప్తి
కరోనా సమయంలో తన సెంటిమెంట్ కోసం రాధే సినిమాను రిలీజ్ చేయాలనే సల్మాన్ ఖాన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా సినిమాను వాయిదా వేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.

చివరి నిమిషంలోనైనా వాయిదాకు
దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, దిశా పటానీ జంటగా నటించిన రాధే చిత్రాన్ని దేశవ్యాప్తంగా థియేటర్లలోనూ, అలాగే ఓటీటీ యాప్ జీప్లెక్స్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే చివరి నిమిషంలోనైనా ఈ సినిమాను వాయిదా వేయాలని ప్రయత్నిస్తున్నాం. సానుకూల పరిస్థితులు ఏర్పడిన తర్వాత థియేటర్లలో రిలీజ్ చేయాలని సూచిస్తున్నట్టు సమాచారం.
Recommended Video

సల్మాన్ ఖాన్ కెరీర్ గురించి
సల్మాన్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. లాక్‌డౌన్‌లో తన తదుపరి సినిమాలపై భారీగా కసరత్తు చేసి గట్టిగానే ప్లాన్ చేసుకొన్నారు. రాధే తర్వాత అంతిమ్: ది ఫైనల్ ట్రూత్, అమీర్ ఖాన్ చిత్రం లాల్ సింగ్ చద్దాలో, అలాగే షారుక్ ఖాన్ నటిస్తున్న పఠాన్ చిత్రంలో, టైగర్ 3 చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











