ఊహించని ధరకు ‘రాధే’ మూవీ రైట్స్: అలా రికార్డు క్రియేట్ చేసిన సల్మాన్ ఖాన్
పేరుకు బాలీవుడ్ హీరోనే అయినా దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు కండల వీరుడు సల్మాన్ ఖాన్. సుదీర్ఘ కాలంగా ఇండియన్ సినిమాపై హవాను చూపిస్తోన్న ఆయన.. ఎన్నో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవలి కాలంలో వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ సత్తా చాటుతున్నాడు. స్థాయికి తగ్గట్లే ఆయన సినిమాలకు ఎప్పుడూ ఎవరికీ సాధ్యం కాని రీతిలో రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అందుకే సల్మాన్ ప్రతి సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరిపోతూ వస్తోంది. దీంతో అతడు రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్.. ప్రభుదేవా దర్శకత్వంలో 'రాధే: ద మోస్ట్ వాంటెడ్ భాయ్' అనే సినిమా చేస్తున్నాడు. 'వాంటెడ్', 'దబాంగ్ 3' తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే తాజాగా ఈ సినిమా రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. 'రాధే' మూవీ శాటిలైట్, డిజిటల్, థియేట్రికల్, మ్యూజిక్ రైట్స్‌తో పాటు ఓవర్సీస్ హక్కులను జీ స్టూడియోస్ సంస్థ రూ.230 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. తద్వారా భారీ ధరకు అమ్ముడైన చిత్రంగా ఇది నిలిచింది. దీంతో సల్మాన్ ఖాతాలో అదురైన రికార్డు వచ్చి చేరింది.

చాలా గ్యాప్ తర్వాత కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం 'రాధే'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో మేఘా ఆకాశ్, దిశాపటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రణ్ దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి, సోహైల్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. కరోనా లాక్‌డౌన్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వాయిదా పడ్డాయి. దీంతో సినిమా విడుదల కూడా ఆలస్యం అయింది.


Click it and Unblock the Notifications











