twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లి గురించి బాంబ్ పేల్చిన స్టార్ హీరో.. సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

    |

    బాలీవుడ్ హీరోల్లో సల్మాన్ ఖాన్ పెళ్లి టాపిక్ ఎప్పుడూ ఓ సమాధానం లేని ప్రశ్న గానే ఉండేది. కానీ తాజాగా సల్మాన్ ఖాన్ తన పెళ్లి విషయమై కుండ బద్దలు కొట్టేస్తూ మాట్లాడేశారు. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కొనసాగుతున్న ఆయన.. పెళ్లి, దానికి సంబందించిన వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ఆ వివరాలు చూద్దామా..

    మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్

    మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వయసు ప్రస్తుతం 53 ఏళ్ళు. ఈ వయసులో కూడా యువకుడిలా కనిపిస్తుంటారు సల్మాన్. అదే ఆయన పెళ్లి విషయాన్ని కాస్త వెనక్కి నెట్టేస్తోంది. అయితే మాత్రం అసలు వయసు మీడియాకు తెలియదా? అందుకనే సల్మాన్ ఎక్కడ కనిపించినా మొదట ఆయన్ను అడిగేది మీ పెళ్లి సంగతేంటనే. తాజాగా భారత్ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆయన్ను అదే ప్రశ్న వేయడంతో ఇక లాభం లేదని అసలు విషయం చెప్పేశారు సల్మాన్.

    అసలు మీరు పెళ్లి చేసుకుంటారా? లేక..

    అసలు మీరు పెళ్లి చేసుకుంటారా? లేక..

    అస‌లు మీరు పెళ్లి చేసుకుంటారా? లేక బ్యాచిలర్ గానే ఉండిపోదామనుకుంటున్నారా? అని మీడియా వాళ్ళు అడిగే స‌రికి అస‌లు విష‌యం బయటపెట్టి షాకిచ్చారు కండ‌ల‌వీరుడు సల్మాన్. 'అస‌లు పెళ్లి చేసుకోవ‌డం అనేది చ‌చ్చిపోవ‌డంతో స‌మానం' అని ఆయన అనేయడం సంచలనంగా మారింది. ఈ సందర్బంగా త‌న‌కు పెళ్లి అనే టాపిక్‌పైనే న‌మ్మ‌కం లేద‌ని చెప్పాడు సల్మాన్ ఖాన్.

    పెళ్లి అనేది చ‌చ్చిపోతున్న సంస్థ అంటూ

    పెళ్లి అనేది చ‌చ్చిపోతున్న సంస్థ అంటూ

    అంతేకాదు.. పెళ్లి అనేది చ‌చ్చిపోతున్న సంస్థ అని, పెళ్లి చేసుకోవడం కంటే స‌హ‌జీవ‌నం చేయ‌డం మేలు అని సల్మాన్ చేసిన వ్యాఖ్యలు బీ టౌన్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పెళ్లి ప్రస్తావనను దాటిస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు ఏకంగా జీవితంలో పెళ్లే చేసుకోనని చెప్పడం జనాల్లో చర్చనీయాంశం అయింది.

    స‌హ‌జీవ‌నం తోనే లైఫ్ ముగిస్తాడా..?

    స‌హ‌జీవ‌నం తోనే లైఫ్ ముగిస్తాడా..?

    ఈ మ‌ధ్య కాలంలో బాలీవుడ్లో ఉన్న సీనియర్ హీరోలు, హీరోయిన్లంతా వరుసగా పెళ్లి చేసుకుంటున్నారు. దీంతో సల్మాన్ కూడా ఆ రేసులో ఉంటాడని భావించారంతా. మరోవైపు సల్మాన్ ప్రస్తుతం క‌త్రినా కైఫ్‌తో రిలేష‌న్‌లో ఉన్నాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. సల్మాన్ మాటలను బట్టి చూస్తే.. స‌హ‌జీవ‌నం తోనే జీవితాంతం గడిపేలా ఉన్నాడేమో అనిపిస్తోంది.

    భారత్ మూవీ

    భారత్ మూవీ

    అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సుమారు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది భారత్ మూవీ. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జూన్ 5వ తేదీన రంజాన్ కానుకగా విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంటోంది. కాగా మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రాని తీసుకున్నారు. కానీ ఆమె తన పెళ్లి కారణంగా సినిమా నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలో కత్రినాను తీసుకున్నారు.

    English summary
    Katrina Kaif and Salman Khan played lead roles in Bharath movie. This movie promotions Salman Khan says about his marriage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X