ఆ స్టార్‌ని ఇష్టపడ్డ కరీనా .. 7 ఏళ్ల పాటు సీక్రెట్‌గా.. బాత్‌రూమ్‌లో బయటపడ్డ పోస్టర్
ఎంతటి సెలబ్రెటీలైనా, కోట్లాది మంది అభిమాన గణం ఉన్నా హీరో హీరోయిన్లు కూడా మనలాంటి మనుషులే. వాళ్లకు కూడా ఇష్టాయిష్టాలు, అలవాట్లు ఉంటాయి. హీరోయిన్లు కొందరి హీరోలకి ఫ్యాన్స్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇష్టాలను బయటపెట్టేవారు కొందరైతే, లోపల దాచుకునేవారు మరికొందరు. ఈ క్రమంలోనే బాలీవుడ్ అగ్రనటి కరీనా కపూర్ ఓ స్టార్ హీరోని ఎంతో ఇష్టపడ్డారు. ఈ విషయాలను ఓ అగ్రనటుడు బయటపెట్టాడు. ఈ వివరాల్లోకి వెళితే..
లాయర్ కాబోయి యాక్టర్‌గా
భారతీయ సినీ పరిశ్రమలో దిగ్గజ నటుల్లో ఒకరైన ఎవర్‌గ్రీన్ రాజ్ కపూర్ మనవరాలే కరీనా కపూర్. రణధీర్ కపూర్, బబిత కపూర్‌ల కుమార్తె. 1980 సెప్టెంబర్ 21న ముంబైలో జన్మించిన కరీనా .. లాయర్ కావాలని కలలు కన్నారు. కానీ చదువు మధ్యలోనే సినిమాల వైపు మనసు లాగడంతో న్యాయశాస్త్రాన్ని పక్కనపెట్టేసింది. కిషోర్ నమిత్ కపూర్ వద్ద నటనలో శిక్షణ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ.. 2000వ సంవత్సరంలో రెఫ్యూజీ అనే సినిమాతో అరంగేట్రం చేశారు.

స్టార్స్‌తో డేటింగ్
ఆ వెంటనే ముఝే కుచ్ కెహ్నా హై, అజ్నాబీ, కబీ కబీ కబీ గమ్, చమేలీ, దేవ్, ఓంకార, ఓతెల్లో, జబ్ వీ మీట్, త్రీ ఇడియట్స్ , వీ ఆర్ ఫ్యామిలీ, గోల్‌మాల్ 3, బాడీగార్డ్, రా వన్, ఎక్ మైనే ఔర్ ఏక్ తు, తలాష్, సింగమ్ రిటర్న్స్, బజరంగీ భాయిజాన్, ఉడ్తా పంజాబ్ తదితర చిత్రాలతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. షాహిద్ కపూర్, అభిషేక్ బచ్చన్‌లతో కరీనా ప్రేమాయణం సాగించారు. మరో అగ్రనటుడు హృతిక్ రోషన్‌తోనూ ఆమె డేటింగ్ చేసినట్లుగా అప్పట్లో బీటౌన్ మీడియాలో రూమర్స్ వినిపించాయి.
సైఫ్ అలీఖాన్‌తో ప్రేమ, పెళ్లి
ఈ దశలో సైఫ్ అలీఖాన్‌తో ప్రేమలో పడ్డ కరీనా ఆయనతో కొన్నాళ్లు డేటింగ్ చేసి పెద్దల అంగీకారంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. అప్పటికే సైఫ్‌కు అమృతా సింగ్‌తో వివాహం జరిగి సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ అనే పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. పలువురు సైఫ్‌తో పెళ్లిపై పెదవి విరిచినప్పటికీ కరీనా తను కోరుకున్న వ్యక్తిని పెళ్లాడారు. కరీనా - సైఫ్‌లకు ఇద్దరు పిల్లలు. కుటుంబ బాధ్యతలతో కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చినప్పటికీ రీ ఎంట్రీలో ది క్రూ, సింగమ్ ఎగైన్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు కరీనా కపూర్.
కరీనా బాత్రూమ్‌లో ఆ హీరో పోస్టర్
ఇదిలాఉండగా కరీనా కపూర్‌కు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయనను అభిమానించింది. అంతేకాదు.. ఏకంగా బాత్‌రూమ్‌లో సల్మాన్ ఖాన్ పోస్టర్‌ను అతికించి తన అభిమాన నటుడిని చూసుకుంటూ మురిసిపోయేదట. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ ఖాన్ బయటపెట్టారు. కపిల్ శర్మ వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 ఓపెనింగ్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన పోస్టర్లను జనం ఎలా వాడుతున్నారో చెబుతూ.. కరీనా కపూర్ బాత్రూమ్‌లోనూ తన పోస్టర్ ఉన్నట్లు చెప్పారు. ఓసారి కరీనా ఇంటికి వెళ్లినప్పుడు ఈ పోస్టర్ గమనించానని.. అప్పుడు ఆమెకు 8 ఏళ్లు ఉంటాయని, అయితే 15 ఏళ్ల వయసు వచ్చేసరికి నా పోస్టర్ తీసేసి రాహుల్ రాయ్ పోస్టర్ పెట్టిందని సల్మాన్ ఖాన్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సల్మాన్ - కరీనా మధ్య రాహుల్ అడ్డుపడ్డాడంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











