రాధే : మరో రికార్డ్ బద్దలు కొట్టిన సల్మాన్.. ఇండియాలోనే టాప్!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. దబాంగ్ 3 తర్వాత సల్మాన్ గ్యాప్ తీసుకున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన దబాంగ్ 3 ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. అయినా సరే ఆయన మళ్ళీ ప్రభుదేవాకి ఛాన్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి రాధే సినిమా చేశారు. ఆ సినిమా ఈ నెలలో రంజాన్ సందర్భంగా రిలీజ్ కావాల్సి ఉన్నా, రిలీజ్ విషయంలో సందిగ్ధత నెలకొంది. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా ద్వారా సల్మాన్ మరో రికార్డు అందుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే

సౌత్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోలు సౌత్ కథల మీదే కాక సౌత్ మ్యూజిక్ మీద కూడా స్పెషల్ ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. అందులో సల్మాన్ ఖాన్‌కి మరింత ఆసక్తి. అందుకే ఛాన్స్ దొరికిన ప్రతీసారి సౌత్ సూపర్ హిట్స్ సాంగ్స్‌ను తన సినిమాల కోసం రీమిక్స్ చేస్తున్నారు ఆయన. తాజాగా రాధే సినిమా కోసం కూడా అల్లూ అర్జున్ క్రేజీ సాంగ్‌ను రీమిక్స్ చేశారు.

సూపర్ సక్సెస్
అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ డీజే సినిమాలోని సీటీమార్ సాంగ్ ను రాధే సినిమా కోసం రీమిక్స్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన నాటి నుంచే అనేక రికార్డులు సృష్టిస్తోంది. ఇక గతంలో రామ్ 'రెడీ' సినిమాను అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసిన సల్మాన్, ఆ సినిమాలో ఆర్య 2 సూపర్ హిట్ రింగ రింగాను రీమిక్స్ చేశారు. ఆ పాట కూడా బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మరి ఇప్పుడు సీటీమార్ కూడా అదే రేంజ్‌లో సక్సెస్ అయింది.

బన్నీకి స్పెషల్ థాంక్స్
నిజానికి ఈపాట రిలీజ్ చేసిన రోజునే సల్మాన్ ఖాన్.. అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా.. సీటీమార్ పాటను మాకు అందించినందుకు ధన్యవాదాలు. నువ్వు ఈ పాటలో డ్యాన్స్ చేసిన తీరు అద్భుతం. బ్రదర్ లవ్ యూ అంటూ ట్వీట్ చేశారు. ఇక సల్మాన్ లాంటి బడా హీరో తన డ్యాన్స్ మీద స్పందించడం పట్ల అల్లు అర్జున్ కూడా ఖుషీ అయ్యారు. సల్మాన్‌కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు.
Recommended Video

ఇండియాలోనే ఫాస్టెస్ట్ 100 మిలియన్ సాంగ్
ఈ సీటీమార్ వీడియో సాంగ్ యూట్యూబ్ రికార్డ్స్‌ను బద్దలు కొడుతోంది. ఇక ఈ సాంగ్ ఇండియాలో ఫాస్టెస్ట్ 100 మిలియన్ మూవీ సాంగ్ గా నిలిచింది. మొత్తం మీద రికార్డు వ్యూస్ రావడంతో అటు యూనిట్ తో పాటు అల్లు అర్జున్ ఫాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. ఇక సల్మాన్ ఖాన్‌తో సాలిడ్ డ్యాన్స్ చేయించాలన్న ఉద్దేశంతోనే ఈ పాటను పిక్ చేసుకున్నామని ప్రభుదేవా చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











