వరుస ఫ్లాపులతో డౌన్‌ఫాల్.. ఫ్లాట్ అమ్ముకున్న స్టార్ హీరో.. ఎన్ని కోట్లంటే?

సినీ పరిశ్రమ సక్సెస్ వెంటే పరుగులు తీస్తుంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా? గతంలో ఎన్ని సూపర్‌హిట్స్ ఇచ్చినప్పటికీ ఒక్క ఫ్లాప్ వస్తే చాలు ఎవ్వరూ పట్టించుకోరు. స్టార్లు, సూపర్‌స్టార్లుగా వెలుగొందిన ఎంతో మంది ఈ హిట్, ఫ్లాప్ సైకిల్ మధ్యలో నలిగిపోయారు. కొంతమంది అలాగే వెండితెర మీద నుంచి అదృశ్యమయ్యారు. ఆస్తులు అమ్ముకుని సినీరంగం నుంచి దూరమైన వారెందరో. తాజాగా ఓ సూపర్‌స్టార్ తన ఫ్లాట్‌ను అమ్ముకోవడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఈ వివరాల్లోకి వెళితే..

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా సల్మాన్ ఖాన్
సదరు హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్. మూడున్నర దశాబ్ధాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరించడంతో పాటు బాలీవుడ్‌కు ఐకాన్‌గా నిలిచారు సూపర్‌స్టార్. ఇండియాలోనే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే ఖచ్చితంగా ఉండేపేరు సల్మాన్ ఖాన్. 60 ఏళ్లకు దగ్గరైనా ఇంత వరకు పెళ్లి చేసుకోకపోవడం రోజూ హాట్ టాపిక్కే. కెరీర్‌లో ఎంతో మంది ముద్దుగుమ్మలతో డేటింగ్ చేసినా.. ఏ ఒక్కరితోనూ పెళ్లి పీటలు ఎక్కలేకపోయారు సల్మాన్.

Salman Khan sells his apartment for rs 5 35 crores Here s the details

ఇండియాలో రిచెస్ట్ హీరోలలో ఒకరు
కండలవీరుడిగా, సల్లూభాయ్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే సల్మాన్ ఖాన్ .. బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు బుల్లితెరపై హోస్ట్‌గానూ ఆయన సక్సెస్ అయ్యారు. సినిమాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్, వ్యాపారాలతో ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోలలో ఒకరిగా నిలిచారు సల్మాన్. ఆయన ఆస్తుల విలువ దాదాపు 3000 కోట్లకు పై మాటే. సల్మాన్ హోస్ట్‌గా బిగ్‌బాస్ హిందీ 19 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

వరుస ఫ్లాపులతో సల్మాన్
కాగా.. ఇండస్ట్రీ డల్‌గా ఉన్నప్పుడల్లా తన సినిమాలతో ఊపు తీసుకొచ్చారు సల్లూభాయ్. 60 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో సమానంగా సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నారు. అలాంటి సల్మాన్ ఖాన్ కెరీర్ గత కొంతకాలంగా డౌన్‌ఫాల్ అవుతోంది. తను నటించిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. పదేళ్ల క్రితం సల్మాన్ నుంచి సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ వణికిపోయేది. దబాంగ్, ఏక్ థా టైగర్, బజరంగీ భాయీజాన్, సుల్తాన్ వంటి సినిమాలతో కలెక్షన్ల వర్షం కురిపించారు సల్మాన్ ఖాన్.

హిట్ కోసం సల్మాన్ ఎదురుచూపులు
అయితే ఇప్పుడు సల్మాన్‌కు లక్ ఏమాత్రం కలిసి రావడం లేదు. ఏ సినిమా తీసినా ఫ్లాప్, డిజాస్టర్‌గా నిలుస్తోంది. సికందర్, కిసి కా భాయ్ కిసి కా జాన్, రాధే, భారత్, దబాంగ్ చిత్రాలు వరుసపెట్టి ఫ్లాప్ అయ్యాయి. టైగర్ 3 కాస్తో కూస్తో పర్లేదని అనిపించుకుంది. పరిస్ధితి ఇలాగే కొనసాగితే సల్మాన్ ఖాన్ బ్రాండ్, మార్కెట్ వాల్యూ పడిపోయే ప్రమాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో ప్రస్తుతం గాల్వన్ అనే సినిమా చేస్తున్నారు సల్మాన్ ఖాన్.

ఫ్లాట్ అమ్మేసిన సల్మాన్ ఖాన్
ఇదిలాఉండగా సల్మాన్ ఖాన్ .. ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో ఉన్న ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను విక్రయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. శివ ఆస్థాన్ హైట్స్‌లో ఉన్న ఈ ఫ్లాట్ దాదాపు 1318 చదరపు అడుగుల్లో నిర్మించారు. దీనిని సల్మాన్ ఖాన్ 5.35 కోట్లకు విక్రయించినట్లుగా బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఈ డీల్ కారణంగా స్టాంప్ డ్యూటీ కింద 32 లక్షల రూపాయలు, రిజిస్ట్రేషన్ ఛార్జ్‌లు కింద 30 వేల రూపాయలను ప్రభుత్వానికి చెల్లించారాట. ముంబైలోనే ఖరీదైన ఏరియాలలో బాంద్రా వెస్ట్ ఒకటి. ఇక్కడ బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఎంతో మంది రాజకీయ, వ్యాపార, ఇతర రంగాల ప్రముఖులు నివసిస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఫ్లాట్ అమ్మిన వార్త బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 3000 కోట్లకు పైగా ఆస్తులున్న సల్మాన్ ఖాన్‌ .. కేవలం 5.35 కోట్లకు ఫ్లాట్‌ను అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Read more about: salman khan bollywood news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X