టైగర్ vs పఠాన్.. ఒకే స్క్రీన్ పై సల్మాన్-షారుక్ కు 'వార్': మధ్యలో Jr NTR

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గడ్డు కాలాన్ని ఎదుర్కొంది. సినిమాలో కంటెంట్ ఎలా ఉన్న ఏదో ఒక విధంగా విమర్శల పాలయింది. బాయ్ కాట్, నెపోటిజం అంటూ అనేక కారణాలతో హిందీ చిత్రాలను ట్రోలింగ్ చేశారు, బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే బాలీవుడ్ బాద్ షా నుంచి వచ్చిన పఠాన్ సినిమా మాత్రం అందుకు భిన్నంగా విజయం సాధించింది. మొదట్లో కొంత విమర్శలు ఎదుర్కొన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇందులో షారుక్ ను కాపాడేందుకు టైగర్ గా సల్మాన్ ఇచ్చిన ఎంట్రీ ఆడియెన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చింది. అయితే త్వరలో పఠాన్, టైగర్ ఇద్దరూ తలపడనున్నారు. అందుకోసం రంగం సిద్ధం అవుతోంది.

నాలుగోసారి జోడీ కట్టి: హిందీ చిత్రసీమలో హిట్ పెయిర్ గా టాక్ తెచ్చుకున్నారు షారుక్ ఖాన్, హాట్ బ్యూటి దీపిక పదుకొణె. వీళ్లిద్దరు ఇప్పటికీ ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాల్లో జంటగా కలిసి నటించారు. ఇక నాలుగోసారి వీళ్లిద్దరు కలిసి జోడి కట్టిన చిత్రం పఠాన్. చాలా కాలం గ్యాప్ అంటే దాదాపుగా నాలుగేళ్ల తర్వాత షారుక్ ఖాన్ నుంచి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం నమోదు చేసిందో చెప్పాల్సిన పనిలేదు.

Salman Khan Shahrukh Khan Act Together In YRF Spy Universe Tiger Vs Pathaan

సల్మాన్ ఖాన్ ఎంట్రీతో: హృతిక్ రోషన్ తో బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలు చిత్రీకరించిన యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ మూవీ వరల్డ్ వైడ్ గా జనవరి 25న గ్రాండ్ గా విడుదలైంది. యశ్ రాజ్ ఫిలీంస్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పిరియన్స్ కు విజిల్స్, క్లాప్స్ పడ్డాయి. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఏక్ థా టైగర్ సినిమాతో: పఠాన్ సినిమా ఆదిత్య చోప్రా స్పై యూనివర్స్ లో భాగంగా చిత్రీకరించారు. దీనికంటే ముందుగా సల్మాన్ ఖాన్ ఏక్ థా టైగర్ సినిమాతో ఈ యూనివర్స్ క్రియేట్ అయింది. అయితే యూనివర్స్ అనే కాన్సెప్ట్ పెద్దగా లేదు. కానీ అప్పుడే ఏక్ థా టైగర్, తర్వాత ఐదేళ్లకు టైగర్ జిందా హై అనే టైగర్ సిరీస్ ను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబో వార్ మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.

Salman Khan Shahrukh Khan Act Together In YRF Spy Universe Tiger Vs Pathaan

కొనసాగిన స్పై యూనివర్స్: ఇక షారుక్ ఖాన్ పఠాన్ మూవీతో స్పై యూనివర్స్ క్రియేట్ అయింది. అందుకే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ను టైగర్ క్యారెక్టర్ తో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే నిజానికి ఈ స్పై యూనివర్స్ కు 2012లో వచ్చిన ఏక్ థా టైగర్ మూవీతోనే బీజం పడినట్లు అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రాన్ని కబీర్ ఖాన్ తెరకెక్కించగా.. 2017లో వచ్చిన టైగర్ జిందా హై మూవీని అలీ అబ్బాస్ దర్శకత్వం వహించి స్పై యూనివర్స్ కొనసాగించారు.

స్పై యూనవర్స్ మూవీస్: టైగర్ సిరీస్ తర్వాత ఈ స్పై యూనివర్స్ లోకి సిద్ధార్థ్ ఆనంద్ ఎంట్రీ ఇచ్చాడు. 2019లో వార్ మూవీని తెరకెక్కించారు. దీంతో ఈ యూనివర్స్ వేగవంతం అయింది. ఇక పఠాన్ మూవీతో అది మరింత బలంగా మారింది. అందుకే ఇప్పుడు యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ స్పై యూనివర్స్ లో భాగంగా వరుసగా సినిమాలను నిర్మించనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఇందులో టైగర్ 3, వార్ 2, టైగర్ vs పఠాన్ సినిమాలు ఉన్నాయి.

పూర్తి స్థాయిలో సల్మాన్-షారుక్: అయితే పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ జస్ట్ కెమియో మాత్రమే చేశాడు. కానీ టైగర్ vs పఠాన్ మూవీలో మాత్రం ఇద్దరు పూర్తి స్థాయిలో నటించనున్నారు. అది కూడా ఇద్దరు తలపడనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికోసం పెద్ద యాక్షన్ సీన్ తెరకెక్కించే బాధ్యతను డైరెక్టర్ సిద్ధార్థ్ కు నిర్మాత ఆదిత్య చోప్రా అప్పగించారట.

హృతిక్ రోషన్ కు విలన్ గా: ఇక టైగర్ vs పఠాన్ సినిమా 2024లో జనవరిలో ప్రారంభం అవుతుందని ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. అంటే త్వరలోనే పఠాన్ లో షారుక్ ని కాపాడిన టైగర్ అతనితోనే తలపడటం ఇరు అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరే కాకుండా వార్ 2 మూవీలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో తారక్ విలన్ గా లేకుంటే మరో అధికారిగా నటించనున్నాడని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X