షాకిచ్చిన సల్మాన్ కామెంట్స్.. ఈ యంగ్ హీరోయిన్స్ ని కూడా వదలను

ప్రస్తుతం బావుడికి సినిమా దగ్గర స్టార్స్ అంతా కూడా తమ కెరీర్ ని మళ్ళీ గాడిలో పెట్టుకునే హిట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకపుడు వందల కోట్లు కొల్లగొట్టిన స్టార్స్ ఇపుడు మినిమమ్ వసూళ్లు కూడా రాబట్టడం కష్టంగా మారింది. కాగా ఇలా స్టార్ హీరోస్ లో షారుఖ్ ఖాన్ మళ్ళీ క్రేజీ కంబ్యాక్ కొట్టి ఫామ్ లోకి వస్తే తన తోటి స్టార్స్ లో ఉన్న అమీర్ ఖాన్ అలాగే సల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్ తన రేంజ్ కంబ్యాక్ కోసం చూస్తున్నారు.

ఇక ఇలా సల్మాన్ ఖాన్ నుంచి ఓ భారీ చిత్రం ఇపుడు వస్తుంది. దీనితో అయినా సల్మాన్ ఖాన్ హిట్ కొడతాడేమో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఆ చిత్రమే "సికందర్". ఇపుడు బాలీవుడ్ హీరోలు అంతా సౌత్ దర్శకులని నమ్ముకునే మంచి హిట్స్ అందుకున్నారు. రన్బీర్ కపూర్ కి సందీప్ రెడ్డి వంగ అనిమల్ సినిమా ఇస్తే షారుఖ్ ఖాన్ కి అట్లీ జవాన్ సినిమా ఇచ్చాడు.

salman khan shocking comments on ananya and janhvi

ఇలా ఇపుడు మళ్ళీ సల్మాన్ ఖాన్ ఏ ఆర్ మురుగదాస్ తో సినిమా చేయగా ఇపుడు ఈ సినిమా కూడా వారి మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా లేదా అనేది కీలకంగా మారింది. కాగా సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో తనకంటే ఏజ్ లో చాలా చిన్నది అయ్యిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సరసన రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రశ్న పైనే ఈ మధ్య సల్మాన్ సీరియస్ కూడా అవ్వడం జరిగింది.

ఓపిక ఉంటే రష్మికతో ఏంటి తన కూతురుతో కూడా సినిమా చేస్తాను మీకేం నొప్పి అని ఘాటు స్పందన తాను ఇవ్వడం జరిగింది. ఇక ఈ కాంట్రవర్సీ మరిచే లోపే మరో షాకింగ్ స్టేట్మెంట్ సల్మాన్ నుంచి రావడం మరో షాకింగ్ గా మారింది. కాగా ఈసారి మళ్ళీ బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ అనన్య పాండే అలాగే మరో హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ పై చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి.

తన స్టేట్మెంట్ ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే తాను యంగ్ హీరోయిన్స్ అనన్య, జాన్వీ లతో నటించాలి అనుకుంటున్నాను అని నాతో వాళ్ళు నటిస్తే వాళ్ళే స్టార్ హీరోయిన్స్ గా మారుతారు అంటూ చెప్పడం అనేది మరింత షాకింగ్ గా మారింది. కానీ తమ నడుమ ఉన్న ఏజ్ గ్యాప్ ని ఫ్యాన్స్ గనుక ఒకవేళ అభ్యంతరం చెప్పకపోతే అందుకు సిద్ధమే అంటూ చేసిన స్టేట్మెంట్ ఇపుడు సోషల్ మీడియాలో సహా సినీ వర్గాల్లో వైరల్ గా మారిపోయాయి.

మరి సల్మాన్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసారో కానీ తనపై మళ్ళీ కొంచెం నెగిటివ్ తీసుకొచ్చే రకంగా ఇవి మారాయి. ఇక తన అవైటెక్ సినిమా సికందర్ చిత్రంలో రష్మిక మాత్రమే కాకుండా కాజల్ అగర్వాల్ కూడా నటిస్తుండగా ఈ మార్చ్ 30న గ్రాండ్ గా సల్మాన్ ఫెవరెట్ పండుగ సీజన్ ఈద్ రేస్ లో రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X