దుబాయ్‌లో సల్మాన్ ఖాన్ కు అందమైన భార్య, 17ఏళ్ళ కూతురు.. లైవ్ షోలో నోరువిప్పిన స్టార్ హీరో
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కాంట్రవర్సీలకు దూరంగా ఉండాలని చూస్తాడు కానీ అనుకోకుండా కొన్నిసార్లు ఊహించని వివధాలు అతని మెడకు చుట్టుకుంటూ ఉంటాయి. ఇక సల్మాన్ కఠిన సమయాల్లో చాలా సహనంగా ఉండేందుకు ప్రయత్నం చేసాడు. ఇక సహనం కోల్పోతే మీడియా ఎదురుగా ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోడు. ఇక ఇటీవల ఒక రియాలిటీ షోలో కొన్ని వార్తలపై చాలా సీరియస్ అవుతూ స్పందించాడు.

ప్లాప్ సినిమాతో కూడా
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఇండియా మొత్తంలో అత్యదిక మార్కెట్ ఉన్న హీరోల్లో ఒకడు. ఎలాంటి సినిమా చేసినా కూడా ఈజీగా 200కోట్ల బిజినెస్ చేయగలవు. ప్లాప్ సినిమాతో కూడా సల్మాన్ పెట్టిన బడ్జెట్ ను వెనక్కి తేగలడు. ఆ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ హోదాను అందుకున్న సల్మాన్ ఖాన్ అప్పుడప్పుడు రుమర్స్ పై చాలా సీరియస్ అవుతుంటాడు.

అందమైన భార్య 17 ఏళ్ళ కూతురు
ఇక ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో అయినటువంటి సల్మాన్ ఖాన్ కు పెళ్లి అంటే చిరాకు పెడుతుంటాడు అని అందరికి తెలిసిందే. కానీ ఒకసారి ఈ అగ్ర హీరో సీక్రెట్ గా ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నట్లు కథనాలు వచ్చాయి. దుబాయ్ లో అందమైన భార్య 17 ఏళ్ళ కూతురు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో కూడా ఆ న్యూస్ వైరల్ అయ్యింది.

కాస్త అప్సెట్ అవుతూ
ఇక ఆ కథనాలపై ఇటీవల తన సోదరుడు వ్యాఖ్యతగా ఉన్న షోలో సల్మాన్ క్లారిటీ ఇచ్చాడు. ఆర్బాజ్ ఖాన్ 'పించ్' షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించగా అందులో ఈ సీజన్ ఫస్ట్ గెస్ట్ గా సల్మాన్ ఖాన్ వచ్చాడు. ఇక దుబాయ్ లో ఫ్యామిలీ సంగతులు ఏమిటని ఆర్బాజ్ ఖాన్ సరదాగా అడుగగా సల్మాన్ ఖాన్ కాస్త అప్సెట్ అవుతూ ఆన్సర్ ఇచ్చాడు.

వాళ్లకు సమాధానం ఇవ్వాలా
అసలు ఇలాంటి రూమర్స్ ఎలా క్రియేట్ చేస్తారో నాకు అస్సలు అర్థం కాదు. ఇలాంటి ప్రశ్నలు అడిగితే నేను ఎలా రియాక్ట్ అవ్వాలని అనుకుంటున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. అయితే ఇప్పుడు నేను నాకు నా భార్య లేదని సమాధానం చెప్పి.. వాళ్లకు సమాధానం ఇవ్వాలా? అని సల్మాన్ ఖాన్ కౌంటర్ ఇచ్చేలా మాట్లాడాడు.

టైగర్ జిందా హై సీక్వెల్
ఇక చిన్నప్పటి నుంచి తాను గెలాక్సీ అపార్ట్మెంట్ లోనే జీవిస్తున్నాను అని చాలామందికి తెలుసని అంటూ తన క్యారెక్టర్ ఏమిటో కూడా తనకు తెలుసని ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదనేలా సల్మాన్ వివరణ ఇచ్చాడు. ఇక ఇటీవల రాధే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సల్మాన్ ఖాన్ నెక్స్ట్ టైగర్ జిందా హై సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


Click it and Unblock the Notifications











