twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ నోట వెంకీమామ.. రామ్ హమారే చోటే భాయ్.. దబంగ్3 ఈవెంట్‌లో స్పీచ్ కేక

    |

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ప్రస్తుతం దబాంగ్ 3 అంటూ రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నాడు. చుల్‌బుల్ పాండేగా సల్మాన్ చేసిన హల్ చల్ అందరికీ తెలిసిందే. దబంగ్, దబంగ్2 చిత్రాలతో బాక్సాఫీస్ పని పట్టిన సల్మాన్ మూడోసారి దండయాత్ర చేసేందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో తెలుగు మార్కెట్‌పైనా భాయ్ కన్నేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీని తెలుగులో ప్రమోట్ చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగాడు. నేడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అంగరంగవైభవంగా నిర్వహించారు.

     రామ్ చరణ్, వెంకీలు ముఖ్య అతిథులుగా..

    రామ్ చరణ్, వెంకీలు ముఖ్య అతిథులుగా..

    సల్మాన్ హైద్రాబాద్‌కు వస్తున్నాడంటే.. రామ్ చరణ్ ఆయన వెంట ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనుకున్నట్టుగానే ఈ వేడుకకు రామ్ చరణ్ హాజరయ్యాడు. చెర్రీతో పాటే వెంకీమామతో హిట్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్న వెంకటేష్ కూడా మెరిసాడు.

    ఈ వేదిక సరిపోదు..

    ఈ వేదిక సరిపోదు..

    సల్మాన్ అంటే ఎంత ప్రేమో చెప్పడానికి ఈ ఒక్క ఈవెంట్..ఈ ఒక్క స్టేజ్ సరిపోదంటూ చెప్పుకొచ్చాడు. సల్మాన్ భాయ్, చిరు, వెంకీ, సుదీప్ లాంటి స్టార్ల దగ్గర్నుంచీ నేర్చుకోవాల్సింది డైలాగ్ డెలీవరి, యాక్టింగ్ కాదు.. క్రమశిక్షణ నేర్చుకోవాలి. రాబోయే తరం వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నాడు.

    మన ప్రేమను చూపించాలి..

    మన ప్రేమను చూపించాలి..

    చెర్రీ మాట్లాడిన అనంతరం వెంకీమామ మాట్లాడాలని కోరుకుంటున్నానని వెంకటేష్‌కు మైక్ అందించాడు. వెంకీ మాట్లాడుతూ.. దబంగ్ 3 తెలుగులో రావడం సంతోషంగా ఉందని అన్నాడు. సినిమాను సూపర్ హిట్ చేసి మన ప్రేమను చూపించాలని తెలిపాడు.

    సల్మాన్ స్పీచ్ కేక..

    సల్మాన్ స్పీచ్ కేక..

    నమస్కార్ అంటూ మొదలు పెట్టిన సల్మాన్.. హైద్రాబాద్‌కు రావడం సంతోషంగా ఉందన్నాడు. ఇక్కడ హిందీ చిత్రాలను కూడా హిట్ చేస్తారు..అలాంటిది తెలుగులో కూడా రిలీజ్ చేస్తే ఇంకా ఆదరిస్తారని అందుకే దబంగ్ 3ని విడుదల చేస్తున్నామని తెలిపాడు. ‘ఇక్కడ రామ్ నాతో ఉన్నాడు.. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను.. నా చిన్న తమ్ముడిలాంటి వాడు.. చిరంజీవి సర్ నాకు అత్యంత సన్నిహితుడు.. ఇక్కడి వారిలో వెంకీ నాకు ఓల్డెస్ట్ ఫ్రెండ్.. వెంకీమామా.. గత 25యేళ్లుగా నాకు తెలుసు.. ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుంది. నా లెవెల్‌ను పెంచే క్యారెక్టర్‌ను సుదీప్ పోషించాడు.. అందరికీ థ్యాంక్స్.. బీయింగ్ దబంగ్, బీయింగ్ హ్యూమన్' అంటూ తన స్లోగన్ చెప్పి ముగించాడు. అయితే చివర్లో తనదైన శైలిలోఆటకైనా వేటకైనా రెడీ అంటూ ఓ తెలుగును చెప్పేశాడు.

    English summary
    Salman Khan Speech AT Dabangg 3 Telugu Pre-Release Event. Dabangg3 Pre-Release event held on the 18th of December at JRC Convention, Film Nagar Hyderabad. Ram Charan And Venkatesh Attended As Chief Guest. This Movie Directed By Prabhudeva. releasing On 20th December.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X