సల్మాన్, సుదీప్ క్రేజీ స్టెప్పులు... కేక పెట్టించిన ప్రభుదేవా.. ఆ వీడియో మీ కోసం!

Recommended Video

Salman Khan, Kichcha Sudeep Get Dance Lesson From Prabhudheva || Filmibeat Telugu

ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఎక్కువగానే కనిపిస్తాడు. ఇక ఆయనకు కండలవీరుడు సల్మాన్ ఖాన్ తోడైతే ఇక చెప్పేదేముంటుంది. ప్రస్తుతం వీరిద్దరు దంబంగ్ 3 సినిమా కోసం జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సల్మాన్ సోదరుడు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షూటింగ్ సందర్బంగా 90లో హిట్‌ సాంగ్‌గా దేశాన్ని ఉర్రూతలూగించిన పాటకు సల్మాన్, సుదీప్ కిచ్చ, సాజిద్ నడియావాలాతో ప్రభుదేవా స్పెప్పులేపించడం సోషల్ మీడియా క్రేజీగా మారింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ షేర్ చేసిన వీడియో వైరల్ అయింది. ఇంతకు ఆ పాట ఏమిటంటే..

 ఎవర్ గ్రీన్ ఊర్వశీ.. ఊర్వశీ పాట

ఎవర్ గ్రీన్ ఊర్వశీ.. ఊర్వశీ పాట

90వ దశకంలో ప్రేమికుడు సినిమాతో ప్రభుదేవా హీరోగా మారారు. అప్పటి వరకు కొరియోగ్రాఫర్‌గా అందరితో స్పెప్పులు వేయించిన ఈ ఇండియన్ మైఖేల్ జాక్సన్.. ఊర్వశీ.. ఊర్వశీ అనే పాటకు చేసిన డ్యాన్స్‌ అప్పట్లో సంచలనంగా మారింది. అంతేకాకుండా ఆడియో, వీడియో పరంగా ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటికీ పాట వింటే ఎవరైనా కాలు ఆడించకపోతే.. ఏదో లోపం ఉందనే భావించాలే అనేంతగా సాంగ్‌లో పవర్ ఉంటుంది.

సల్మాన్, సుదీప్‌తో స్టెప్పులు

అలాంటి ఊర్వశీ పాటకు సల్మాన్, సుదీప్ కిచ్చ, నిర్మాత సాజిద్ నడియావాలాతో స్పెప్టులు వేయించారు. తాను చేస్తున్న స్టెప్పులను చూసి ఈ ముగ్గురు ప్రభుదేవాను అనుకరించారు. ఈ వీడియోను సల్మాన్ షేర్ చేసి.. ప్రభుదేవా చేత డ్యాన్స్ క్లాసులు తీసుకొంటున్నాం అని సల్మాన్ వీడియోతోపాటు ఓ కామెంట్ పెట్టారు. ఇప్పటికే ఆ వీడియోను ఇప్పటికే సుమారు 30 లక్షల మంది వీక్షించారు.

పాత్ర కోసం బరువు తగ్గిన సల్మాన్ ఖాన్

పాత్ర కోసం బరువు తగ్గిన సల్మాన్ ఖాన్

ఇక వీడియోలో సల్మాన్ ఖాన్ సన్నబడి నాజుకుగా కనిపించాడు. దంబంగ్ 3 సినిమా కోసం పల్మాన్ దాదాపు 7 కిలోల బరువు తగ్గడం గమనార్హం. సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో 20 ఏళ్ల చుల్‌బుల్ పాండేగా కనిపించబోతున్నట్టు సమాచారం. బరువు తగ్గడానికి సల్మాన్ జిమ్‌లో కండలు కరిగించి కుర్రాడిలో మారిపోయాడు. మరోసారి చుల్ బుల్ పాండేగా కేక పెట్టించడానికి సిద్ధమవుతున్నాడు.

మరోసారి రజ్జోగా సోనాక్షి సిన్హా

మరోసారి రజ్జోగా సోనాక్షి సిన్హా

దంబంగ్ 3 సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన సోనాక్షి సిన్హా మరోసారి నటిస్తున్నది. సల్మాన్ ఖాన్‌తో గతంలో దంబంగ్‌లో రజ్జో పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. దంబంగ్ 3 ప్రధానంగా ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. అయితే యంగ్ రజ్జోగా, మధ్య తరగతి గృహిణిలో సోనాక్షి కనిపించబోతున్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X