What is AVM? సల్మాన్ ఖాన్‌కు అరుదైన వ్యాధి.. నరకాన్ని మించిన బాధతోనే బాలీవుడ్ స్టార్ అలా!

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నటుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. బాలీవుడ్ మెగా స్టార్ గా కొన్నేళ్లుగా ప్రేక్షకులను సినిమాలతో అలరిస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా, టెలివిజన్ ప్రజెంటర్ గా సల్మాన్ ఖాన్ ఆడియెన్స్ కు వినోదాన్ని అందిస్తూనే ఉన్నారు. 59 ఏళ్లలోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నిర్విరామంగా పని చేస్తున్నారు. అయితే సల్మాన్ తాజాగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన అరుదైన వ్యాధులతో బాధపడుతున్నట్టు చెప్పుకొచ్చారు. 3 రకాల నారాల రుగ్మతలతో బాధపడుతున్నాని చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే..

14 ఏళ్లు ట్రైజెమినల్ న్యూరల్జియాతో నరకం..
సల్మాన్ ఖాన్ గతంలో ట్రైజెమినల్ న్యూరల్జియా వ్యాధికి గురయ్యారు. ట్రైజెమినల్ న్యూరల్జియా అంటే.. ముఖం నుండి మెదడుకు సంకేతాలను తీసుకువెళ్ళే నాడి పనిచేయకపోవడం. లేదా ఆ నాడీ వ్యవస్థ మొత్తం కుదించబడటం. దాని వల్ల ముఖంపై తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. కనీసం పళ్లు తోముకున్నా.. మేకప్ వేసుకున్నప్పుడు తగిలే తేలికపాటి స్పర్శ కూడా కరెంట్ షాక్ లా ఉంటుంది. ఆ బాధను తగ్గించుకునేందుకు 2011లో సల్మాన్ ఖాన్ సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇదెలా ఉంటే.. తాజాగా కపిల్ షోలో మరో 2 రకాల రుగ్మతలు AVM, Brain Aneurysmతో బాధపడుతున్నట్టు చెప్పుకొచ్చారు.

Salman Khan Suffering from AVM

AVM, Brain Aneurysm అంటే ఏమిటీ..
An arteriovenous malformation (ధమని సిరల వైక్యంల) అనేది అనేది మెదడులోని ధమనులు, సిరల మధ్యల కలిగే చిక్కు. దీని వల్ల నరాల్లోని రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. మూర్చలు, దీర్ఘకాలిక తలనొప్పి, బ్రెయిన్ లో రక్తస్రావం కూడా అవుతుంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఇదే వ్యాధితో బాధపడుతున్నానని చెప్పాడు. ఇంత బాధలో ఉన్నప్పటికీ యాక్షన్ సీన్లలో నటిస్తున్నామని చెప్పారు.

Brain Aneurysm (మెదడు అనూరిజం) అనేది మెదడులోని రక్తనాళ గోడలోని ఉబ్బిన ప్రాంతం. ఇది మెదడులో ప్రాణాంతకంగా రక్తస్రావానికి దారి తీస్తుంది. వీటితో తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు, నాడీ సంబంధిత సమస్యలు తరుచూ ఉత్సన్నమవుతుంటాయి. 50 ఏళ్ల పైబడిన వారిలో ఈ సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా సల్మాన్ ఖాన్ మూడు రకాల నాడీ సంబంధిత రుగ్మతలతో బాధపడుతూ ఉండటం అభిమానుల్లో ఆందోళనను కలిగిస్తోంది. ఇక సల్మాన్ ఖాన్ ఎప్పటికప్పుడు తన ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూనే ఉన్నారు.

1988 నుంచి ఇప్పటి వరకు..
సల్మాన్ ఖాన్ ఇప్పటికీ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 1988 నుంచి 2025 వరకు 122 చిత్రాల్లో నటించారు. 38 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్నారు. చివరిగా 'సికిందర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నెక్ట్స్ 7 డాగ్స్ అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక తొలిసారిగా సౌత్ ఆడియెన్స్ కు తెలుగు చిత్రం గాడ్ ఫాదర్ లో కనిపించారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి సల్మాన్ ఖాన్ మాస్ స్టెప్పులేసి ఆకట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X