సల్మాన్ ఖాన్‌కు కరోనా నెగెటివ్.. బిగ్ బాస్ షోకు ఎలాంటి ఢోకా లేదు
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్టాఫ్‌కు కరోనా అనే వార్తలు ఓ రేంజ్‌లొ వైరల్ అయ్యాయి. సల్మాన్ కారు డ్రైవర్, వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో అందరూ షాక్ అయ్యారు. సల్మాన్ ఇంటి సభ్యులందరూ క్వారంటైన్‌కు పరిమితమయ్యారు. ఈ క్రమంలో సల్మాన్ ఇక బిగ్ బాస్ షోకి రాడని అంతా భావించారు. ఈ వారం హోస్ట్ కూడా మారనున్నాడని అందరూ కథనాలు అల్లేశారు. కానీ అవేవీ నిజం కావు.
తాజాగా సల్మాన్ ఖాన్ కరోనా పరీక్షల ఫలితాలు వచ్చాయి. అందులో సల్మాన్ ఖాన్‌తో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నెగెటివ్ అని వచ్చిందని తెలుస్తోంది. దీంతో అభిమానులందరూ సంతోషంలో మునిగితేలారు. ఇక బిగ్ బాస్ టీం ఈ వార్తలతో ఊపిరి పీల్చుకుందట. వీకెండ్‌కు ఎవరితో హోస్ట్ చేయించాలా? అని మదనపడుతున్న బిగ్ బాస్ టీంకు పెద్ద ఊరట కలిగిందని తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్ ఇక బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ కోసం శుక్రవారం సెట్‌లోకి అడుగుపెట్టనున్నాడని తెలుస్తోంది. రోనా వైరస్ సోకిన సిబ్బందిని ముంబైలోని ప్రముఖ హాస్పిటల్‌లో చేర్పించి, చికిత్స అందేలా చూస్తున్నాడట. ఇక సల్మాన్ సినిమా విషయాలకొస్తే ప్రభుదేవా దర్శకత్వంలో రాధే సినిమాను పూర్తి చేశాడు. అన్ లాక్ ప్రక్రియ మొదలైన తరువాత మళ్లీ షూటింగ్ ప్రారంభించి త్వరగానే ముగించేశారు.


Click it and Unblock the Notifications











