twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD Salmankhan నిత్య బ్రహ్మాచారి.. వివాదాలు ఓ వైపు.. రికార్డులు మరో వైపు

    |

    బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ చుట్టూ ఎన్ని వివాదాలు చుట్టు ముట్టి ఉన్నాయో అందరికీ తెలిసిందే. గతంలో ఉన్న కేసులు, వివాదాలు కాకుండా ఈ ఏడాదిలో సుశాంత్ సింగ్ కేసులోనూ సల్మాన్‌ ఖాన్‌ను నెటిజన్లు టార్గెట్ చేశారు. కానీ సల్మాన్ మాత్రం ఆ సమయంలో ఎంతో హుందాగా స్పందించాడు. అలా సల్మాన్ అవసరమైన సమయంలో తగ్గడంతో అభిమానులు ఫిదా అయ్యారు. లాక్డౌన్ సమయంలో సల్మాన్ తన ఫాంహౌస్‌లో పొలం పనులు చేసుకుంటూ బిజీగా గడిపాడు. నేడు సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సల్మాన్ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను ఓ సారి చూద్దాం.

    సల్మాన్ ఖాన్ అంటే పెళ్లి..

    సల్మాన్ ఖాన్ అంటే పెళ్లి..

    సల్మాన్ ఖాన్ అంటే అందరికీ మొదట గుర్తొచ్చేది పెళ్లి. పెళ్లి కాని ప్రసాదులా జీవితాన్ని అలా గడిపేస్తున్నాడు. సల్మాన్ ఇలా ఒంటరిగా గడిపేయడానికి కూడా కారణాలున్నాయి. గతంలో సల్మాన్ భగ్నప్రేమికుడు. ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్ వంటి వారితో పీకల్లోతు ప్రేమలో మునిగాడని కానీ అవేవీ పెళ్లి పీటల వరకు రాలేదు. ప్రస్తుతం లూలియా వంతూర్‌‌తో సల్మాన్ ప్రేమలో ఉన్నాడని తెలిసిందే.

    వివాదాలతో వైరల్..

    వివాదాలతో వైరల్..

    సల్మాన్ ఖాన్ అంటే పెళ్లి తరువాత వివాదాల టాపిక్‌తోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. కృష్ణజింకను వేటాడిన కేస్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్‌లతో సల్మాన్ ఖాన్ ఇమేజ్ దారుణంగా పడిపోయింది. ఇప్పటికీ ఆ కేసుల వ్యవహారం ఓ పట్టాన తేలలేదు. ఈ ఘటనలన్నింటి తరువాతే సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యూమన్ అంటూ ఓ సంస్థను ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేపట్టాడు.

    బాక్సాఫీస్‌పై దాడి..

    బాక్సాఫీస్‌పై దాడి..

    ఒకప్పుడు సల్మాన్ ఫ్యామిలీ ఆడియెన్స్, లవర్ బాయ్ క్యారెక్టర్స్ వేశాడు. కానీ రాను రాను కమర్షియల్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయాడు. బాలీవుడ్ యాక్షన్ సినిమాలకు సల్మాన్ ఖాన్ కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమా అంటే మినిమం వంద కోట్లు కలెక్ట్ చేస్తుందనే టాక్ అక్కడ ఉంది.

    వరుసగా సూపర్ హిట్లు..

    వరుసగా సూపర్ హిట్లు..

    సల్మాన్ ఖాన్ వాంటెడ్ చిత్రం నుంచి మొన్నటి వరకు విడుదలైన దబాంగ్ 3 వరకు అన్నీ కూడా మినిమం వంద కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్లుగా నిలిచాయి. అందులో టైగర్ జిందా హై, భజరంగీ భాయీజాన్, సుల్తాన్,దబాంగ్, ఏక్తా టైగర్ వంటి బ్లాక్ బస్టర్లు ఎన్నో ఉన్నాయి. వరుసగా తొమ్మిది పదిచిత్రాలు వంద కోట్ల క్లబ్, రెండు వందల కోట్ల క్లబ్‌లోకి చేరడం ఇప్పటికీ ఎప్పటికీ ఓ రికార్డ్. డిజాస్టర్లైన ట్యూబ్ లైట్ వంటి చిత్రం కూడా 100 కోట్లకుపైగా కలెక్ట్ చేయడం మరో విశేషం.

    English summary
    Salman khan Turns 55 Birthday Controversies Box office Records.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X