Salman Khan: ఎంట్రీ సీన్ కోసం 10కోట్లు ఏంట్రా బాబు.. హీరో కంటే విలన్ కోసమే ఎక్కువ బడ్జెట్

స్టార్ హీరోల సినిమాలకు ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ అనేవి తప్పనిసరిగా మారాయి. ఇక సినిమా కంటెంట్ కు తగ్గట్లుగా అవసరం ఉంటే మాత్రం ఎంత ఖర్చు చేయడానికైనా సరే సిద్దంగా ఉంటారు. ఇక సల్మాన్ ఖాన్ లాంటి బడా హీరో సినిమాలో కూడా యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఒక సినిమాలో విలన్ పాత్ర ఎంట్రీ సీన్ కోసం ఏకంగా 10కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు టాక్ అయితే వస్తోంది.

ఆ సినిమా మరేదో కాదు సల్మాన్ ఖాన్ టైగర్ ఫ్రాంచైజ్ లో వస్తున్న మరో సినిమా. రా ఏజంట్ గా కనిపించి బాక్సాఫీస్ రికార్డులను బ్లాస్ట్ చేసిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు మరోసారి టైగర్ గా కనిపించబోతున్నాడు. ఇక సినిమాలో విలన్ పాత్ర కోసం ఇమ్రాన్ హష్మీని సెలెక్ట్ చేశారు. ఇక అతని క్యారెక్టర్ సినిమాలో చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. యాక్షన్ సీక్వెన్స్ తో క్రియేట్ చేసిన ఎంట్రీ సీన్ కోసం దాదాపు 10కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Salman khan upcoming movie costly scene for villain entry

ఇప్పటికే రెండు టైగర్ సినిమాలతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు మూడవ పార్ట్ తో అంతకంటే భారీ హిట్ అందుకోవాలని అనుకుంటున్నాడు. బడ్జెట్ కూడా 250కోట్లు దాటనున్నట్లు సమాచారం. సల్మాన్ కు ఇష్టమైన యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను మనిష్ శర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక సినిమాలో హీరోయిన్ గా కత్రినా కైఫ్ నటిస్తోంది. ఈ కాంబినేషన్ పై అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. మరి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X