Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సల్మాన్ ఖాన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్.. అందుకే ఆ స్కెచ్ వేశాడా?
మీడియం రేంజ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరు కూడా ప్రస్తుతం పాన్ సినిమాలో పైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్న విషయం తెలిసిందే. రిజల్ట్ తో సంబంధం లేకుండా బడ్జెట్ బిగ్ బడ్జెట్ సినిమాల వైపు ఎక్కువగా అడుగులు వేస్తున్నారు. మార్కెట్ వాల్యూ కూడా ఎక్కువగా పెరగడంతో నిర్మాతలు కూడా ధైర్యంగా ఖర్చు చేస్తున్నారు. ఎందుకంటే థియేట్రికల్ బిజినెస్ అంతగా ఆడకపోయినా కూడా నాన్ థియేట్రికల్ ద్వారా ఎంతో కొంత లాభాలు అయితే వస్తున్నాయి. ఇక ఏ హీరో అయినా సరే ఒక్కసారి పాన్ ఇండియా సినిమాను సెట్స్ పైకి తీస్తే ఇక ఆ తర్వాత సినిమాలు కూడా అదే తరహాలో తెరపైకి వస్తున్నాయి.
ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా పాన్ ఇండియా వైపు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ సినిమాలకు హైదరాబాద్ ఏరియాలో అయితే మంచి గిరాకీ ఉంటుంది. అయితే సల్మాన్ ఖాన్ చాలాసార్లు టాలీవుడ్ మార్కెట్ పై కూడా దృష్టి పెట్టాడు కానీ అవి ఎక్కువ కాలం వరకు వర్కౌట్ అయితే కాలేదు. ఆమధ్య దబాంగ్ 3 సినిమా ను సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో కూడా భారీగానే రిలీజ్ చేశాడు. ముఖ్యంగా తెలుగులో కూడా ప్రమోషన్స్ చేసి మరి విడుదల చేశారు. కానీ ఆ ప్లాన్ అంతగా వర్కౌట్ అయితే కాలేదు. అయితే టాలీవుడ్ కోలీవుడ్ హీరోలు ఎక్కువగా అన్ని భాషల్లో సక్సెస్ అవుతుండడంతో సల్మాన్ ఖాన్ ఆ విషయంపై మరింత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
సల్మాన్ కూడా అలాంటి బడా ప్రాజెక్టులు లైన్ లోకి తేవాలి అని ఫిక్స్ అయ్యాడు. అందుకోసం అన్ని భాషల వారికి కరెక్ట్ అయ్యే కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో పాన్ ఇండియా సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు బాలీవుడ్ లో ఎవరు కూడా తెరకెక్కించిన విధంగా ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. దాదాపు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా కథ అయితే మొత్తం పూర్తయిందట. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తనకు నచ్చిన ఇద్దరి దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వారిలో అయితే ఎవరో ఒకరిని డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకుని ప్రాజెక్టును ఇదే ఏడాది చివర్లో సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నారు.
ఇక తెలుగులో కూడా ఇటీవల ఒక సినిమా చేయడానికి సల్మాన్ ఖాన్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ లో సల్మాన్ ఖాన్ నటించినున్నట్లు కథనాలు అయితే వెలువడుతున్నాయి. అయితే ఈ సినిమాకు సల్మాన్ ఖాన్ తన భవిష్యత్తు ప్రాజెక్టును దృష్టిలో ఉంచుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ముందుగా తెలుగు ప్రేక్షకులకు మెగాస్టార్ ద్వారా కాస్త దగ్గరై ఆ తర్వాత తన సినిమాను ప్రమోట్ చేయాలని అనుకుంటున్నాడట. తెనుగు కన్నడ ఇండస్ట్రీలో అయితే సల్మాన్ ఖాన్ కు ఒక దారి అయితే సెట్టయ్యింది. కానీ తమిళ్ మలయాళంలోనే మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడం కాస్త కష్టమైన పని. మరి ఆ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ ఏ విధంగా ప్రమోషన్స్ చేస్తాడో చూడాలి.