సల్మాన్ ఖాన్ సినిమా ఓటీటీ రిలీజ్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు
కరోనా దెబ్బకు బాలీవుడ్ లో వేల కోట్ల బిజినెస్ కి గండి పడినట్లయింది. కీలకమైన సమ్మర్ హాలిడేస్ తో పాటు ఈద్ ని కూడా మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక సల్మాన్ ఖాన్ ఈ ఏడాది వరుసగా రెండు సినిమాలను రిలీజ్ చేయలని అనుకున్నాడు. కానీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా రాధే సినిమాను భారీగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ మొదట్లోనే కరోనా రాకతో ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది.
ఇక రాధే సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఓటీటీలోనే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు గత కొన్ని రోజులుగా కొన్ని బాలీవుడ్ మీడియాలలో రూమర్స్ వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నిర్మాతలు కొట్టి పారేశారు. థియేట్రికల్ రిలీజ్ ని ఎంత మాత్రం స్కిప్ చేయడం లేదని, వచ్చే ఏడాది ఈద్ కానుకగా సల్మాన్ ఖాన్ రాధే విడుదల కానున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవల అక్షయ్ కుమార్ లక్ష్మీ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇక అదే తరహాలో సల్మాన్ ఖాన్ రాధే కూడా రానున్నట్లు వార్తలు రావడంతో అందరూ నిజమని అనుకున్నారు. కానీ అవన్నీ తప్పుడు వార్తలని చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది. ఇక సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వాంటెడ్ (పోకిరి రీమేక్) బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఇక దబాంగ్ 3 పరవాలేదు అనిపించింది. ఇక ఇప్పుడు రాధే పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి సల్మాన్ ఖాన్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











