చిరంజీవిని కాపీ కొడుతున్న సల్మాన్ ఖాన్.. మెగాస్టార్ వేసిన ఆ స్టెప్పులతో..

By Manoj Kumar P

ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఉన్న హీరోల్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ ఎంతో ప్రత్యేకం అని చెబుతుంటారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న ఈ సీనియర్ హీరోకు మగ అభిమానులతో పాటు భారీ స్థాయిలో లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. దీంతో అతడికి భారీ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే సల్మాన్ సినిమాలకు ఎప్పుడూ అంతే స్థాయిలో రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అందుకే సల్మాన్ ప్రతి సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరిపోతూ వస్తోంది. దీంతో అతడు రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలోనే అతడు తాజాగా చేస్తున్న సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి స్టెప్‌ను వాడుకోబోతున్నాడట. ఇంతకీ ఏంటా స్టెప్..? పూర్తి వివరాల్లోకి వెళితే...

తెలుగులోనూ భారీ క్రేజ్

తెలుగులోనూ భారీ క్రేజ్

సల్మాన్ ఖాన్ అంటే బాలీవుడ్ హీరో అని చెబుతుంటారు. కానీ, ఆయనకు మాత్రం దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు వాళ్లకు సల్లూ భాయ్ బాగా పరిచయం. హైదరాబాద్ నేపథ్యం కలిగిన ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన ప్రతి సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంటుందిక్కడ.

మన డైరెక్టర్.. మరో సీక్వెల్

మన డైరెక్టర్.. మరో సీక్వెల్

‘వాంటెడ్'తో భారీ విజయాన్ని అందించిన ప్రభుదేవాతో సల్మాన్ మరోసారి జత కట్టాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘దబాంగ్ 3' తెరకెక్కుతోంది. ఇందులో సల్మాన్ సరసన సోనాక్షి సిన్హా నటిస్తోంది. గతంలో వచ్చిన ‘దబాంగ్ 2'కు ఇది సీక్వెల్‌గా వస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికితోడు ఇప్పటికే ‘దబాంగ్' పేరిట వచ్చిన రెండు సినిమాలు భారీ విజయాన్ని దక్కించుకోవడంతో ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది.

దగ్గుబాటి వాళ్లే తీసుకున్నారు

దగ్గుబాటి వాళ్లే తీసుకున్నారు

‘దబాంగ్ 3'ని హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే తెలుగు వెర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సల్మాన్ సినిమా దక్షిణాదిలో విడుదల కావడం ఇదే తొలిసారి. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recommended Video

#CineBox : RGV Changed 'Kamma Rajyamlo Kadapa Redlu' Movie Title !
చిరంజీవి స్టెప్‌ను వాడుతున్నాడు

చిరంజీవి స్టెప్‌ను వాడుతున్నాడు

ఈ సినిమాలో ఓ పాటకు సల్మాన్ ఖాన్.. ‘ఇంద్ర'లో చిరంజీవి వేసిన వీణ స్టెప్‌ను వాడుకోబోతున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ప్రభుదేవా దక్షిణాదికి చెందిన వ్యక్తి కావడంతో ఆ స్టెప్ ఎంత పాపులర్ అయిందో ఆయనకు తెలుసు. అందుకే తెలుగు వారిని ఆకట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా ఈ స్టెప్‌ను సల్మాన్ చేత వేయిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X