twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ ఖాన్ నా బట్టలు, బూట్లు మోసేవాడు.. అలాంటి స్టేజ్ నుంచి వచ్చాడు: జకీ ష్రాఫ్ షాకింగ్ కామెంట్స్

    |

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఈ రోజుల్లో ఈజీగా ఓపెనింగ్స్ ద్వారానే 200కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోగలడు. అయితే ఒకప్పుడు సల్మాన్ ఖాన్ చిన్న స్థాయి నుంచి వచ్చిన వాడే. ఎంతో కష్టపడి స్టార్ హీరో అయ్యాడు. తండ్రి అప్పటికే రైటర్ గా క్లిక్కయినప్పటికి సొంతంగానే ప్రయత్నాలు చేశాడు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ యాక్టర్ టైగర్ ష్రాఫ్ సల్మాన్ పై ఎవరు ఊహించని కామెంట్స్ చేశాడు.

    Recommended Video

    Salman Khan Clash with Jackie Shroff for Sangeeta Bijlani Now Goes Viral
    తండ్రి సపోర్ట్ లేకుండా

    తండ్రి సపోర్ట్ లేకుండా

    సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ అబ్దుల్ రషీద్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలకు రైటర్ గా వర్క్ చేశాడు. నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. అయితే సల్మాన్ మాత్రం తండ్రి సపోర్ట్ లేకుండా దర్శకుడు అవ్వాలని ప్రయత్నాలు చేశాడు.

    డైరెక్టర్ అవ్వాలని..

    డైరెక్టర్ అవ్వాలని..


    మొదట సల్మాన్ ఖాన్ హీరోగా చేయాలని అనుకోలేదు. నటనపై అంతగా ఇంట్రెస్ట్ లేదని పలువురి దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అప్పట్లో సహాయక దర్శకులను ఆల్ మోస్ట్ ఒక పనివాళ్ళ లాగే చూసేవారు. సినిమా కోసం ఎంత కష్టపడినా కూడా కూలీ వాళ్ళు చేసే పనులు కూడా వాళ్లే చేసేవారు. సల్మాన్ కూడా సెట్స్ లో ఉన్నప్పుడు అలాంటి పనులు కూడా చేశాడట.

    సల్మాన్ ఖాన్ తో సోదర భావం

    సల్మాన్ ఖాన్ తో సోదర భావం

    ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ మోస్ట్ టాలెంటేట్ యాక్టర్ జాకి శ్రాఫ్ కూడా సల్మాన్ ఖాన్ ఒకప్పటి జీవితం గురించి పాజిటివ్ కామెంట్స్ చేశాడు. దాదాపు మూడు దశాబ్దాలుగా సల్మాన్ తనకు తెలుసని మా ఇద్దరి మధ్య విడదీయలేని సోదర భావం ఉందని వివరణ ఇచ్చారు.

    సల్మాన్ ఖాన్ నా బూట్లు మోసేవాడు

    సల్మాన్ ఖాన్ నా బూట్లు మోసేవాడు

    నేను సల్మాన్ ఖాన్ ను ఫస్ట్ ఒక మోడల్‌గా చూశాను. ఆ తరువాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేయడం కూడా చూశాను. ఫలక్ (1988) షూటింగ్‌లో అతను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నా బట్టలు, బూట్లు కూడా మోసేవాడు. ఎప్పుడు కూడా నన్ను ఆప్యాయంగా చూసేవాడు. అప్పుడే అతనితో నాకు సోదరుడి బంధం ఏర్పడింది.. అని జాకి ష్రాఫ్ అన్నారు.

    సల్మాన్ కెరీర్ లో నా పాత్ర..

    సల్మాన్ కెరీర్ లో నా పాత్ర..

    ఇక సల్మాన్ ఖాన్ అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన అనంతరం సడన్ గా హీరో అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అప్పుడే నేను సహాయం చేశాను. సల్మాన్ ఖాన్ ఫొటోలను కొంతమంది నిర్మాతలకు చూపించాను. ఇక చివరికి మైనే ప్యార్ కియా (1989) అనే సినిమాతో మొదటి ఛాన్స్ దక్కింది. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ విధంగా సల్మాన్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి నేనొక కారణం అయినందుకు చాలా సంతోషంగా ఉంది.. అని జాకి ష్రాఫ్ వివరణ ఇచ్చారు.

    English summary
    Once upon a time Salman Khan came from a small scale. He worked hard and became a star hero. The father had already clicked as a writer but tried on his own. In a recent interview, senior actor Tiger Shroff made unexpected comments on Salman
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X