వెంకటేష్ - సల్మాన్ ఖాన్ బాలీవుడ్ మూవీ.. టైటిల్ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే?

సినిమా ప్రపంచంలో ప్రస్తుతం నెవర్ బిఫోర్ అనేలా కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. ముఖ్యంగా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి అగ్రహీరోలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా కూడా అగ్రహీరోలు ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఏమాత్రం సందేహించడం లేదు. ఇక బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ముందు ముందు సంబంధాలు మరింత బలంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి వెంకటేష్ సల్మాన్ ఖాన్ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

మంచి స్నేహం..

మంచి స్నేహం..

సల్మాన్ ఖాన్ వెంకటేష్ ఇద్దరు కూడా మంచి మిత్రులు అని అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే గతంలో చాలా సినిమాల్లో ఒకరికొకరు రీమేక్ చేసుకున్నారు కూడా. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ సినిమాను వెంకటేష్ తెలుగులో చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా రీమేక్ చేయాలని సల్మాన్ ఖాన్, వెంకటేష్ ను ప్రత్యేకంగా కోరాడు. వీరి మధ్య స్నేహం ఈనాటిది కాదు. వెంకటేష్ ఇరవై ఏళ్ల నుంచి సల్మాన్ ఖాన్ తో చాలా క్లోజ్ గా ఉంటుందని తెలుస్తోంది.

 యమలీల రీమేక్..

యమలీల రీమేక్..

ఇక మొత్తానికి సల్మాన్ ఖాన్ వెంకటేష్ కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు గా తెలుస్తోంది. అయితే 25 ఏళ్ల క్రితమే వెంకటేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాలు చేశాడు. చంటి సినిమా తెలుగు ఇండస్ట్రీలో బాక్సాఫీస్ హిట్టయిన అనంతరం హిందీలో కూడా రీమేక్ చేశారు. అనారి టైటిల్ లో విడుదలైన ఆ సినిమా అక్కడ అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక 1995లో వెంకటేష్ యమలీల సినిమాను హిందీలో రీమేక్ చేశాడు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

 వెంకీతో సల్మాన్ మూవీ

వెంకీతో సల్మాన్ మూవీ

హిందీలో రెండు సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న వెంకటేష్ మళ్ళీ అటు వైపు తిరిగి చూడలేదు. ఇక సల్మాన్ ఖాన్ తో మాత్రం అతనికి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. గతంలోనే వీరు ఒక సినిమా చేయాలని అనుకున్నారు. కానీ మళ్ళీ ప్లాన్ వర్కవుట్ కాలేదు. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ కావడంతో సల్మాన్ ఖాన్ ఎవరైనా టాలీవుడ్ హీరో తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక తనకు అత్యంత మంచి మిత్రుడు అయినటువంటి వెంకటేష్ తో ఇటీవల ప్రాజెక్ట్ ను సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

బుట్టబొమ్మకు లక్కీ ఛాన్స్

బుట్టబొమ్మకు లక్కీ ఛాన్స్

ఇక సల్మాన్ వెంకీ ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. కంప్లీట్ యాక్షన్ కామెడీ ఫిలిం గా రాబోతున్న ఈ సినిమాకు భాయీజాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హీరోయిన్ గా పూజా హెగ్డేను కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం అయి బుట్టబొమ్మలు సల్మాన్ ఖాన్ కి జోడి గా సెలక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక వెంకటేష్ కోసం మరొక సౌత్ హీరోయిన్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు.

దర్శకుడు ఎవరంటే?

దర్శకుడు ఎవరంటే?

భాయీజాన్ సినిమాను 2022 మొదట్లోనే పట్టాలేక్కించేందుకు నిర్మాత సాజిద్ నదియధ్వలా ప్రణాళికలు రచిస్తున్నారు. సినిమాను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఫర్హాద్ సంజి డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ దర్శకుడు హౌస్ ఫుల్ 3 హౌస్ ఫుల్ 4 సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ వెంకటేష్ తో కూడా ఒక ప్రయోగం చేయబోతున్నట్లు సమాచారం. మరి ఆ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X