సల్మాన్ ఖాన్ వెంకటేష్ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' ట్రైలర్ రిలీజ్.. విలన్ గా మరో హీరో!

బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ ఖాన్​కు పరిచయం అక్కర్లేదు. 50 ఏళ్ల వయసు దాటిన స్టిల్​ మోస్ట్ బ్యాచిలర్​గా ఉన్న సల్లూ భాయ్​ వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవలే పఠాన్ మూవీలో అదిరిపోయే కెమియే చేసిన సల్మాన్ ఖాన్ త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. టైగర్ 3 షూటింగ్ లో బిజీగా ఉన్న సల్లూ భాయ్ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' మూవీతో ఎంటర్టైన్ చేయనున్నాడు. ఈ మూవీపై మరింత హైప్ పెంచేలా తాజాగా ట్రైలర్ వదిలారు.

బాలీవుడ్ భాయ్ గా అందరూ ముద్దుగా పిలుచుకునే సల్మాన్ ఖాన్ తర్వాతి సినిమాతో హై రేంజ్ లో సక్సెస్ అందుకునేందుకు సిద్ధమయ్యాడు. కిసీ కా భాయ్ కిసీ కి జాన్ జాన్ మూవీలో సల్మాన్ ఖాన్ ప్రధాన హీరోగా, బుట్టబొమ్మ పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా సందడి చేయనున్నారు. వీరిద్దరితోపాటు ఇందులో విక్టరీ వెంకటేష్, భూమిక కీలక పాత్ర పోషించునున్నారు. ఇందులో బిగ్ బాస్ బ్యూటి షెహనాజ్ గిల్ కూడా నటిస్తోంది.

Salman Khan Venkatesh Kisi Ka Bhai Kisi Ki Jaan Movie Trailer Released

కిసీ కా భాయ్ కిసికి జాన్ సినిమాలో పూజా హెగ్డేకు వెంకటేష్ అన్నయ్యగా కనిపిస్తుండగా కనిపిస్తుండగా వీరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగా చూపించారు. ఈ సినిమాతో వెంకటేష్ కూడా బాలీవుడ్ లో హైలెట్ అవ్వాలని అనుకుంటున్నాడు. ఇక ఇటీవల తెలంగాణ నేపథ్యంలో బతుకమ్మకు సంబంధించిన ఒక పాట విడుదల చేయగా ఆకట్టుకుంది. అలాగే ఏంటమ్మా అనే మరో పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన డ్యాన్సుతో అలరించాడు.

తాజాగా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ హిందీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో సల్మాన్ ఖాన్ కు పేరు లేదని అందరూ తనను భాయ్ అని పిలుస్తారని చెప్పడం.. అలా పలకడానికి పూజా హెగ్డే ఇబ్బంది పడటం వంటి లవ్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక వయలెన్స్ అంటే పడని సాధారణ వ్యక్తిగా వెంకటేష్ అలరించాడు. సీనియర్ హీరో జగపతి పవర్ ఫుల్ విలన్ గా మరోసారి తన మార్క్ చూపిస్తాడని ట్రైలర్ ద్వారా అర్థమైపోతుంది. యాక్షన్, లవ్, రొమాంటిక్, సెంటిమెంట్ వంటి సీన్లతో ట్రైలర్ ఆసక్తిగా ఉంది.

ఇక ట్రైలర్ ఎండింగ్ లో రెగ్యులర్ తెలుగు సినిమాల టచ్ ఇచ్చినట్లుగా అనిపించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ జీ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తోంది. ఫర్హాద్ సమ్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కాటమరాయుడు ఒరిజినల్ తమిళ సినిమా వీరమ్ కిరీమేక్ గా తెరకెక్కిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 21 థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X