ఫాంహౌస్‌లో బాలీవుడ్ బ్యూటీతో సల్మాన్ గృహ నిర్భంధం.. వీడియో లీక్
కరోనావైరస్ విస్తృత వ్యాప్తితో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయాడు. ముంబైకి సమీపంలోని పాన్వెల్ ఫాంహౌస్‌లో కుటుంబ సభ్యులతో సేద తీరుతున్నాడు. తన వెంట సోదరి అర్పితా శర్మ, బావ ఆయుష్ శర్మతోపాటు వారి పిల్లలు ఆహిల్, ఆయత్ కూడా ఉన్నారు. అయితే షాకింగ్‌గా ఫాంహౌస్‌లో బాలీవుడ్ తార జాక్వలైన్ ఫెర్నాండేజ్‌తో కనిపించడం అభిమానులకు షాక్ గురి చేసింది. వివరాల్లోకి వెళితే..

ఫాంహౌస్‌లో సల్మాన్ గృహ నిర్బంధం
కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో మోదీ లాక్‌డౌన్ ప్రకటన చేయగానే ప్రభుదేవాతో చేస్తున్న రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ అనే చిత్ర షూటింగ్‌ను వెంటనే నిలిపివేశాడు. తనకు ఇష్టమైన పాన్వెల్ ఫాంహౌస్‌కు తన ఫ్యామిలీతో కలిసి చేరుకొన్నారు. అనుకోకుండా కలిసి వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొనే పనిలో ఉన్నారు.

వ్యవసాయం, పెయింటింగ్, జిమ్‌లో బిజిగా
తన ఫాంహౌస్‌లో వంట చేయడం, ఆ తర్వాత బొగ్గుతో పెయింటింగ్ వేస్తూ తన ప్రతిభకు పదును పెట్టారు. అలాగే అక్కడే ఉన్న జిమ్‌లో వర్కౌట్ చేస్తూ సమయాన్ని గడుపుతున్నాడు. అంతేకాకుండా ట్రెక్కింగ్, పలు ఎకరాల్లో విస్తరించి ఉన్న భూముల్లో వ్యవసాయ పనులపై దృష్టిపెట్టారు.

సల్మాన్ ఫ్యామిలీతో జాక్వలైన్
పాన్వెల్ ఫాంహౌస్‌లో సల్మాన్ ఖాన్ ఫ్యామిలీతో జాక్వలైన్ జత కలిసింది. అర్పిత పిలలతో ఎంజాయ్ చేస్తూ స్వీయ గృహ నిర్బంధాన్ని పాటిస్తున్నది. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ బాద్షాకు చేసిన వీడియో కాల్‌లో మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ ఫాం హౌస్‌లో ఉన్న విషయాన్ని వెల్లడించింది.
Recommended Video
మ్యూజిక్ వీడియోలో జాక్వలైన్
తాజాగా గెండా ఫూల్ అనే మ్యూజిక్ వీడియోలో జాక్వలైన్ నటించింది. ఈ సందర్భంగా ఆ వీడియో గురించి మాట్లాడుతూ.. వీడియో ఛాట్ చేసింది. ఆ క్రమంలో తన వెనుక ఉన్న సల్మాన్ ఖాన్‌ను చూపించింది. జాక్వలైన్ మాట్లాడుతుండగా సల్మాన్ కూడా ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకొన్నాడు.


Click it and Unblock the Notifications











