భార్యకు విడాకులు.. ఆమెతో రెండో పెళ్లి, 58 ఏళ్ల వయసులో తండ్రయిన నటుడు
భారతీయ చిత్ర పరిశ్రమలో నటీనటుల పెళ్లిళ్లు, ఎఫైర్లు, ప్రేమకథల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎవరు విడాకులు తీసుకుంటారో? ఎవరు మళ్లీ పెళ్లి చేసుకుంటారో? చెప్పలేని పరిస్ధితి . ఇండస్ట్రీలో తమ కంటే చిన్నవారిని, తమ కంటే పెద్ద వారిని పెళ్లి చేసుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. తాజాగా భార్యకు విడాకులిచ్చిన ఓ సీనియర్ నటుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల తన రెండో భార్య గర్భం దాల్చినట్లు ప్రకటించిన ఆ స్టార్.. తాజాగా తండ్రి అయ్యాడు. ఈ వివరాల్లోకి వెళితే..
సల్మాన్ సోదరుడిగా ఇండస్ట్రీలోకి
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ పరిచయం అక్కర్లేదు. బలమైన సినీ నేపథ్యం ఉండటంతో అర్బాజ్ ఖాన్‌కు వెండితెరపై ఎంట్రీ చాలా ఈజీగా దొరికింది. ప్యార్ కియా తో డర్నా క్యా, హలో బ్రదర్, దబాంగ్, దబాంగ్ 2, దబాంగ్ 3, తేరే ఇంతేజార్, మే జరూర్ ఆవుంగా, నిర్దోష్ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు అర్బాజ్ ఖాన్. హిందీతో పాటు తెలుగులో జై చిరంజీవా, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, శివం భజే సినిమాలలో నటించి అలరించారు.

ఇక బాలీవుడ్ నటులు అంటేనే ప్రేమలు, పెళ్లిళ్లు, రిలేషన్‌లతో వార్తల్లో ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే తన సహ నటి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరాను 1998లో ప్రేమించి పెళ్లాడారు అర్బాజ్ ఖాన్. ఈ దంపతులకు అర్హాన్ ఖాన్ సంతానం. బాలీవుడ్ స్టార్ కపుల్‌గా దాదాపు 19 ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగించిన ఈ జంట వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుని షాకిచ్చింది. 2016 మార్చి 11న ఈ జంటకు న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది.
వివాదాల్లో అర్బాజ్ ఖాన్
మలైకాతో విడాకుల తర్వాత సినిమాలు, వ్యాపారాలు, షోలతో బిజీ అయ్యారు అర్బాజ్ ఖాన్. సినిమాలతోనే కాదు వివాదాలతోనూ తరచుగా వార్తల్లో నిలుస్తాడు అర్బాజ్. 2012లో ఓ వృద్ధురాలిని కారుతో ఢీకొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయిన ఘటన బాలీవుడ్‌లో కలకలం రేపింది. ఆ తర్వాత 2018లో ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌లోనూ అర్బాజ్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
మేకప్ ఆర్టిస్ట్‌తో ప్రేమలో పడ్డ అర్బాజ్
ఈ దశలో అర్బాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌తో ప్రేమలో పడి కొన్నాళ్లు డేటింగ్ చేసి రెండేళ్ల క్రితం ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లయ్యే సమయానికి అర్భాజ్ ఖాన్ వయసు 55 ఏళ్లు కాగా.. ఆమెకు 33. వీరిద్దరి ప్రేమ, పెళ్లి, వయసు తేడాపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చినప్పటికీ.. ఈ జంట పట్టించుకోలేదు. తను నా కంటే వయసులో చిన్నది అయినప్పటికీ ఆమెకు అన్ని విషయాలపై స్పష్టమైన అవగాహన ఉందని అర్బాజ్ కౌంటర్ ఇచ్చాడు.
వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న దశలో అర్బాజ్ - షురా దంపతులు గుడ్‌న్యూస్ చెప్పారు. షురా గర్భం దాల్చారని, త్వరలో తల్లి కాబోతున్నట్లు అర్బాజ్ ప్రకటించారు. తాజాగా అక్టోబర్ 5న షురా ముంబైలోని ఓ హాస్పిటల్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో సల్మాన్ కుటుంబం సంబరాలు చేసుకుంటోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు అర్బాజ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్, సొహైల్ ఖాన్ ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు.


Click it and Unblock the Notifications











