twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ ఖాన్ ను వదలని టెన్షన్.. మొన్న తండ్రికి లేఖ.. ఇప్పుడు లాయర్ కు!

    |

    బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను అతని తండ్రిని చంపేస్తామని ఒక బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. ముంబైలో సల్మాన్ తండ్రి సలీం ఖాన్ వాకింగ్ కు వెళ్లి రెస్ట్ తీసుకునే సమయంలో కూర్చునే బెంచ్ మీద ఆయనకు బెదిరింపు లేఖ దొరికింది. ఈ కేసు మీద పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పుడు తాజాగా సల్మాన్ ఖాన్ లాయర్ కు కూడా హత్య చేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే

    లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి

    లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి

    బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తర్వాత ఇప్పుడు ఆయన లాయర్ హెచ్ సరస్వత్ కు కూడా లేఖ ద్వారా హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ లేఖ అందడంతో పోలీసులు అప్రమత్తమై విచారణ ప్రారంభించారు. దీంతో పాటు హెచ్‌ సరస్వత్‌కు కూడా భద్రత కల్పించారు పోలీసులు. మీడియాలో కధనాల ప్రకారం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్ లాయర్‌కు ఈ బెదిరింపు వచ్చిందని అంటున్నారు.

    జోధ్‌పూర్‌లో ఫిర్యాదు

    జోధ్‌పూర్‌లో ఫిర్యాదు

    లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ లాయర్‌కు ఈ బెదిరింపు వచ్చినట్లు సమాచారం. లాయర్ భవితవ్యం కూడా సిద్ధూ ముసేవాలా లాగానే ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు జీబీ (జీబీ) ఎల్బీ (ఎల్బీ) అని కూడా లేఖలో రాశారు. ఇవి గోల్డీ బ్రార్ మరియు లారెన్స్ బిష్ణోయ్ యొక్క సింబాలిక్ నేమ్స్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. లేఖ ద్వారా సల్మాన్‌ ఖాన్ లాయర్ ను చంపుతామని బెదిరింపులు వచ్చాయని సల్మాన్ న్యాయవాది జోధ్‌పూర్‌లో ఫిర్యాదు చేశారు.

    బెదిరింపు లేఖలు

    బెదిరింపు లేఖలు

    ఈ విషయం దృష్టికి రావడంతో, ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించామని, న్యాయవాది హెచ్ సరస్వత్‌కు కూడా భద్రత కల్పించామని తూర్పు జోధ్‌పూర్ ఏడీసీపీ నజీమ్ అలీ చెప్పారు. కృష్ణజింకను వేటాడినందుకు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇప్పటికే బెదిరించారు. బిష్ణోయ్ వర్గం ఈ కృష్ణ జింకను పవిత్రంగా భావించడం వల్ల ఇలా బెదిరిస్తున్నారని తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఫేమస్ అవ్వాలనే అలాంటి బెదిరింపు లేఖలు పంపిస్తున్నారని అంటున్నారు.

    పోలీసులు దర్యాప్తు

    పోలీసులు దర్యాప్తు

    ఇక జులై 3న హైకోర్టు జూబ్లీ ఛాంబర్‌లో బెదిరింపు లేఖ కనిపించిందని సరస్వత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఛాంబర్‌లో న్యాయవాదుల కార్యాలయాలు ఉన్నాయి. కృష్ణజింకలను వేటాడిన కేసులో నటుడు సల్మాన్ ఖాన్ తరపున న్యాయవాది హెచ్ సరస్వత్‌ వాదించారు. ఈ క్రమంలోనే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. హస్తిమల్ సరస్వత్‌కు వచ్చిన బెదిరింపు లేఖ వాస్తవికతను నిర్ధారించడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ముందు జాగ్రత్తగా ఒక పోలీసు అధికారి ఎల్లప్పుడూ ఆయన వెంట ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.

    Recommended Video

    హ్యాపీ బర్త్ డే చెప్పి మత్తు వదిలించావ్ గా *Reviews | Telugu OneIndia
    మొదటి శత్రువు

    మొదటి శత్రువు

    'శత్రువు మిత్రుడే తనకు మొదటి శత్రువు' అని లేఖలో పేర్కొన్నట్టు చెబుతున్నారు. మహామందిర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి లేఖ్ రాజ్ సిహాగ్ మాట్లాడుతూ, "ఈ లేఖను సరస్వత్ అసిస్టెంట్ జితేంద్ర ప్రసాద్ కనుగొన్నారు, ఆయన వెంటనే న్యాయవాదికి సమాచారం ఇచ్చారు. అయితే సరస్వత్ ఇండియాలో లేకపోవడంతో ఆయనే పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారట. ఈ నేపథ్యంలో బుధవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని.. లేఖ వాస్తవికతను పరిశీలిస్తున్నామని, ముప్పు ఉన్న దృష్ట్యా సరస్వత్‌కు భద్రత కల్పించామని సిహాగ్ తెలిపారు.

    English summary
    Salman Khan's lawyer Hastimal Saraswat gets death threat from Lawrence Bishnoi gang regarding golden deer case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X