34 ఏళ్ల క్రితం సల్మాన్ రాసిన ప్రేమ లేఖ వైరల్... ఎవరికి రాశాడు? ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేతిలో రాసిన ఓ ప్రేమ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 34 ఏళ్ల క్రితం ఆయన ఎవరి కోసం ఆ లేఖను రాశారో ఓ లుక్కేద్దాం పదండి.
సల్మాన్ ఖాన్ హీరోగా హిట్ అందుకున్న తొలి చిత్రం 'మైనే ప్యార్ కియా'. ఈ మూవీ సక్సెస్ అయ్యాక తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన సల్మాన్ ఖాన్ చేతితో రాసిన లేఖ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 1989లో రిలీజ్ అయిన ఈ మూవీలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించింది. సూరజ్ బర్జాత్య దర్శకత్వం వహించారు.

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న లేఖలో సల్మాన్ ఖాన్ 'మైనే ప్యార్ కియా' విజయానికి సహకరించిన తన అభిమానులను ఉద్దేశించి రాసుకొచ్చాడు. సినిమా విడుదలైన నాలుగు నెలల తర్వాత ఆయన ఆ లేఖ రాసినట్లు సమాచారం.
రివ్యూలకి పొంగిపోయిన సల్మాన్ తన కృతజ్ఞతలు తెలుపుతూ "నా గురించి మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ముందుగా నన్ను అంగీకరించినందుకు, నా అభిమానులుగా ఉన్నందుకు ధన్యవాదాలు చెప్పాలి. నేను మంచి పని చేస్తున్నాను. ఏకాగ్రతతో చేస్తున్నాను.

నా అభిప్రాయం మేరకు స్క్రిప్ట్‌లు రూపొందాయి. ఎందుకంటే నేను ఇప్పుడు చేసే పనిని 'మైనే ప్యార్ కియా'తో పోల్చి చూస్తాను. కాబట్టి మీరు ప్రకటన విన్నప్పుడల్లా అది మంచి చిత్రం అవుతుందని భరోసా ఇస్తున్నాను. అందుకోసం నేను నా 100 శాతం ఇస్తాను" అంటూ రాసుకొచ్చారు.
సల్మాన్ తన అభిమానులు, ఫాలోవర్స్ పై ఈ లేఖలో ప్రేమను కురిపించాడు. "నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అలాగే మీరు నన్ను ప్రేమిస్తూనే ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించడం మానేసిన రోజు, మీరు నా సినిమాలు చూడటం మానేస్తారు. నా కెరీర్ ముగిసిపోతుంది. గుర్తుంచుకోండి. మీరు మాలాంటి వారిని తయారు చేసే వ్యక్తులు" అంటూ సల్మాన్ చేతిలో రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది.
ఆ లేఖలో ఇంకా "నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. మీకు ఇప్పటికే తెలుసు. నేను సక్సెస్ అయ్యాను అని అంటున్నారు. నేను అలా అనుకోను. ఇంకా సాధించలేదు, కానీ నాకు ఒక విషయం తెలుసు. నన్ను మీరు అంగీకరంచారు (sic)" అని ఆ లేఖలో పేర్కొన్నారు సల్మాన్.
ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ చివరిగా 'టైగర్ 3'లో కనిపించాడు. ఆయన తదుపరి ఏఆర్ మురుగదాస్ 'సికందర్'లో కనిపించనున్నారు. ఈ చిత్రం 2025 ఈద్ సందర్భంగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











