twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Radhe on Apple TV Live.. సల్మాన్ ఖాన్ మూవీ 65 దేశాల్లో.. టార్గెట్ 100 కంట్రీస్!

    |

    బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, దర్శకుడు ప్రభుదేవా కాంబినేషన్‌లో వచ్చిన రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్‌ చిత్రం ఓటీటీలోను, ఓవర్సీస్‌లో విజయయాత్రను కొనసాగిస్తున్నది. అయితే రికార్డులు తిరగరాస్తున్న సల్మాన్ నటించిన చిత్రం మరో ఘనతను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం తాజాగా మరో రికార్డుకు చేరువైంది. ఆ వివరాల్లోకి వెళితే...

    13వ తేదిన జీ ప్లెక్స్ ఓటీటీ యాప్‌లో

    13వ తేదిన జీ ప్లెక్స్ ఓటీటీ యాప్‌లో

    రాధే చిత్రం మే 13వ తేదిన జీ ప్లెక్స్ ఓటీటీ యాప్‌లో పే పర్ వ్యూ ఫార్మాట్‌లో రిలీజైంది. అయితే భారతీయ సినిమాకు ప్రామాణికంగా మారిన ఐఎమ్‌డీబీ‌లో అత్యంత చెత్త చిత్రంగా నమోదు అయినప్పటికీ.. సల్మాన్ సినిమాకు ఫ్యాన్స్ అండగా నిలిచారు. దాంతో భారీగా వసూళ్లు నమోదయ్యాయి.

    దారుణంగా పైరసీ రక్కసికి బలి

    దారుణంగా పైరసీ రక్కసికి బలి

    రాధే చిత్రం రిలీజైన కొద్ది నిమిషాల్లోనే దారుణంగా పైరసీకి గురైంది. తమిళ్ రాకర్స్, ఇతర పైరసీ వెబ్‌సైట్స్‌లోను, వాట్సప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ యాప్స్‌లో లీక్ అయి విస్తృతంగా ప్రచారం అయింది. ఈ సినిమా పైరసీ గురి కావడతో జీ ఎంటర్‌టైన్‌మెంట్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    పైరసీపై సల్మాన్ ఖాన్ ఆగ్రహం

    పైరసీపై సల్మాన్ ఖాన్ ఆగ్రహం

    తన చిత్రం రాధే మూవీ పైరసీకి గురికావడంపై సల్మాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. ఆ సినిమాను 249 రూపాయలు పెట్టి చూసే అవకాశం కల్పించాం. ఒకవేళ ఈ సినిమాను పైరసీ చేస్తే చట్టరీత్యా నేరం. అలాంటి సైట్లపై సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ తీవ్రమైన చర్యలు తీసుకొంటుంది. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దని సల్మాన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడించారు.

    తొలి రోజే 4.2 మిలియన్ల వ్యూస్

    తొలి రోజే 4.2 మిలియన్ల వ్యూస్

    సల్మాన్ ఖాన్ మూవీ రాధే అనేక ప్రతికూలతలను ఎదుర్కొన్నప్పటికీ.. తొలి రోజు 4.2 మిలియన్ల వ్యూస్ సాధించడం ఓ రికార్డుగా మారింది. సినీ విమర్శకులు పెదవి విరిచినా ఓవర్సీస్‌లో భారీ వసూళ్లను సాధించడం సల్మాన్ ఖాన్ స్టామినాకు అద్దం పట్టింది. ఇప్పటికే దాదాపు 150 కోట్ల లాభాలను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    Recommended Video

    Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
     65 దేశాల్లో రాధే.. 100 దేశాల్లో లక్ష్యంగా

    65 దేశాల్లో రాధే.. 100 దేశాల్లో లక్ష్యంగా

    ఇదిలా ఉండగా, రాధే చిత్రం ఇప్పుడు మరో చరిత్రను రాసేందుకు సిద్ధమైంది. 65 దేశాల్లోని అభిమానులకు చేరువయ్యేందుకు యాపిల్ టెలివిజన్‌లో ప్రసారం కానున్నది. ఇలా యాపిల్ టెలివిజన్‌లో లైవ్ పద్దతిలో ప్రసారం కావడం బాలీవుడ్ చరిత్రలో తొలిసారి. బెల్జియం, డెన్మార్క్, కెనడా, ఫిజి, మలేషియా, శ్రీలంక, సౌతాఫ్రికా, మారిషస్ లాంటి దేశాల్లో ప్రసారం కానున్నది. దాదాపు 100 దేశాల్లో వివిధ ఫ్లాట్‌ఫాంల్లో ఈ సినిమాను ప్రేక్షకులకు అందించాలని నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు.

    English summary
    Bollywood Super star Salman Khan's Radhe live in 65 countries via Apple TV. Its released on may 13 on on ZeePlex in pay-per-view format.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X