సల్మాన్ ఖాన్ రాధే మూవీ ట్రైలర్: అంచనాలు పెంచేసిన ప్రభుదేవా.. ప్రత్యేక ఆకర్షణగా బన్నీ పాట
మూడు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాలో తన హవాను చూపిస్తూ దూసుకుపోతున్నాడు కండల వీరుడు సల్మాన్ ఖాన్. కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటోన్న అతడు.. మరింత జోష్‌తో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో తన అభిమానులను అలరించిన ఈ బడా స్టార్ హీరో.. మరిన్ని చిత్రాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 'రాధే' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
దక్షిణాది స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న చిత్రమే 'రాధే: ద మోస్ట్ వాంటెడ్ భాయ్'. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో సల్లూ భాయ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. ముంబైలో జరుగుతోన్న డ్రగ్స్ దందాను అరికట్టడానికి నియమించిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా ఇందులో అతడి యాక్టింగ్ అదిరిపోయింది. మరీ ముఖ్యంగా అద్భుతమైన డైలాగ్ డెలివరీతో పాటు ప్రత్యేకమైన మేనరిజంతో ఆకట్టుకున్నాడు. ఇక, ఇందులో అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాథమ్' సినిమాలోని సీటీ మార్ పాటను రీమిక్స్ చేశారు.

2017లో వచ్చిన కొరియన్ సినిమా 'ద ఔట్ లాస్' అనే సినిమాకు 'రాధే' రీమేక్‌గా వస్తోంది. 'వాంటెడ్', 'దబాంగ్ 3' తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేస్తున్నారు. మేఘా ఆకాశ్, దిశాపటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రణ్ దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి, సోహైల్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు.


Click it and Unblock the Notifications











