Sikandar Leak: రిలీజ్‌కు ముందే సికందర్ మూవీ లీక్.. బిగ్ షాక్‌లో టీమ్!
ఒకపుడు ఇండియన్ సినిమా అంటే బయట దేశాల్లో ఎక్కడైనా కూడా బాలీవుడ్ అనే అనుకునేవారు. మన దగ్గర ఆయా భాషల్లో సినిమాలు ఉన్నప్పటికీ వాటిని కూడా ఇప్పటికీ బాలీవుడ్ సినిమానే అని అనుకునేవారు కూడా చాలా మంది లేకపోలేరు. కాగా దీనిని మన తెలుగు సినిమాలు మార్చేసరికి ఇపుడు బాలీవుడ్ సినిమాలకి ఉనికి మిస్ అవ్వడం ఆరంభం అయ్యింది.
ఇలా హిందీ సినిమాలు ఇపుడు తమ మార్క్ హిట్స్ ని అందుకోవడానికి శత ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ కొన్ని వర్కౌట్ అయితే కొన్ని వర్కౌట్ కావడం లేదు. కాగా ఈ నేపథ్యంలో పలువురు బిగ్ స్టార్స్ సైతం భారీ హిట్స్ లేక డౌన్ ఫాల్ అయ్యారు. మరి ఇలా బాలీవుడ్ సినిమాలో తన రేంజ్ హిట్ అందుకోవాలని చూస్తున్న హీరోస్ లో మెగాస్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఒకరు.

కాగా సల్మాన్ ఖాన్ గత దశాబ్దం కిందనే బాలీవుడ్ సినిమా దగ్గర 900 కోట్ల సినిమాని అందించారు. కానీ అలాంటి సల్మాన్ సినిమాలు ఇపుడు 400 కోట్లు కూడా అందుకోవడం లేదు. ఇలాంటి స్టార్డం ఉన్న సల్మాన్ ఖాన్ ఇపుడు సౌత్ దర్శకుణ్ణే నమ్ముకున్నారు. కాగా దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తో చేసిన అవైటెడ్ సినిమా 'సికందర్' ఇపుడు విడుదలకి రాబోతుండగా ఈ సినిమా రిలీజ్ ఇంకో ఐదు రోజులు ఉంది అనగానే చిత్ర యూనిట్ కి బిగ్ షాక్ ఇపుడు తగిలింది.
ఇంకా సినిమా థియేటర్స్ లో పడకుండానే సోషల్ మీడియాలో ఫుల్ క్లారిటీతో కూడిన ప్రింట్ తాలూకా విజువల్స్ వైరల్ కావడం సల్మాన్ అభిమానులని ఖంగారు పెడుతున్నాయి. కాగా ఈ మధ్య కాలంలో కేవలం సినిమా వచ్చిన రోజే గంటల్లోనే ఫుల్ క్లారిటీతో కూడిన ప్రింట్ లు వచ్చేసిన సంగతి తెలిసిందే. కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పై ఏ రేంజ్ లో కుట్ర జరిగిందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమా ఇంకా తండేల్ సహా డాకు మహారాజ్ లాంటి సినిమాలు లీక్ చేసిన వారే ఇపుడు సల్మాన్ సికందర్ ని కూడా లీక్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో మరోసారి ఆ సినిమాలని లీక్ చేసిన వాళ్లే ఈ సినిమాని కూడా లీక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు హింట్ ఇస్తున్నారని మరో టాక్ వైరల్ గా మారింది. గేమ్ ఛేంజర్ సినిమాకి కూడా ఇలానే ముందే చెప్పి లీక్ చేశారట.
ఇపుడు ఇదే ప్యాట్రన్ లో కూడా ముందు కొన్ని విజువల్స్ వదిలి ఫుల్ క్లారిటీ ప్రింట్ ని ఆన్లైన్ లో వదలబోతున్నట్టుగా సవాలు చేస్తున్నారు. దీనితో ఈ టాక్ ఇపుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ టాపిక్ గా నడుస్తుంది. కాగా ఈ మాఫియా అంతటి వెనుక ఎవరు ఉన్నారో కానీ నిర్మాతలు మాత్రం భారీగా నష్టపోతున్నారు. మరి సికందర్ విషయంలో మేకర్స్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో కూడా చూడాలి. కాగా ఈ సినిమాలో రష్మిక మందన్నా, కాజల్ అగర్వాల్ లు సల్మాన్ సరసన నటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











