ఇర్ఫాన్‌కు సమంత శ్రద్దాంజలి.. భావోద్వేగమైన వీడియో వైరల్
విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి వార్తతో సినీ ప్రపంచం నివ్వెరపోయింది. ఆయన లేరన్న వార్త జీర్ణించుకోలేకపోయారు. ఇర్ఫాన్ మృతివార్తతో తల్లడిల్లిన సినీ లోకం సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు. పెద్ద పేగులో క్యాన్సర్ సోకడం కారణంగా అస్వస్థతకు గురైన ఇర్ఫాన్ ఖాన్ ఏప్రిల్ 29వ తేదీన ముంబైలోని కోకిలాబెన్ ధిరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో ఉదయం 11.11 గంటల ప్రాంతంలో మృతి చెందిన విషయం తెలిసిందే.
ఇర్ఫాన్ ఖాన్ మృతి వార్తతో సమంత అక్కినేని తీవ్ర దిగ్రాంతికి లోనయ్యారు. ఆయనకు ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఇర్ఫాన్ ఖాన్ నటించిన లైఫ్ ఆఫ్ పై చిత్రంలోని ఓ వీడియోను పోస్టు చేసి.. ఇర్ఫాన్ ఖాన్ ఆత్మకు శాంతి కలగాలి. ఇంత త్వరగా ఈ లోకం వీడటంతో బాధగా ఉంది అంటూ తన ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడించారు.

దర్శకుడు అంగ్ లీ రూపొందించిన లైఫ్ ఆఫ్ పై చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్ డైలాగ్ చెబుతూ.. జీవితంలో ఎవరైనా ఎక్కడో ఒకచోట ముగించాలి. అయితే కనీసం గుడ్‌బై పరిస్థితులు లేకపోవడమే అత్యంత బాధకరం అని అంటారు. ప్రస్తుతం ఈ డైలాగ్ ఆయన మరణానికి సంబంధించిన సంఘటనకు దగ్గరగా ఉంటుంది.
కాగా, ఇర్ఫాన్ ఖాన్ అంత్యక్రియలు ముంబైలోని వెర్సోవా శ్మశాన వాటికలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసాయి. ఆయన అంత్యక్రియలకు హాజరైన వారిలో ప్రముఖులు సందీప్ సింగ్, దర్శకులు విశాల్ భరద్వాజ్ తిఘమాన్షు ధూలియా, రాజ్‌పాల్ సింగ్, కపిల్ శర్మ తదితరులు ఉన్నారు. ఇర్పాన్ పాడే మోసిన వారిలో తిఘామన్షు ధూలియా, సందీప్ సింగ్ ఉన్నారు.


Click it and Unblock the Notifications











