Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలీవుడ్ లో అక్కినేనివారి కోడలిపిల్లకు పెరుగుతున్న డిమాండ్
దక్షిణాది చిత్రసీమను ఓ ఊపు ఊపేసి, అక్కినేని వారింట అడుగుపెట్టిన సమంత, ఇప్పుడు బాలీవుడ్ లోనూ చక్రం తిప్పేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే అమ్మడు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ ద్వారా అక్కడ అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇంకా బాలీవుడ్ లో ఒక్క సినిమాలో కూడా నటించకముందే అప్పుడే ఆమెకు అక్కడ అతి పెద్ద ఫ్యాన్ బేస్ ఏర్పడటం విశేషమనే చెప్పాలి.
నిజమే మరి, మల్లూవుడ్ లో అల్లు అర్జున్ కు భారీ ఫాలోయింగ్ ఉన్నట్లే, బాలీవుడ్ లో సమంతకు మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందట. అదెలా అంటే, తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన సమంత సినిమాలన్నీ హిందీలోకి డబ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమ్మడు అక్కడ కూడా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఇక ఏరి కోరి సమంత సినిమాలు డబ్బింగ్ చేస్తున్నారు అంటే, అమ్మాయికి ఏ రేంజ్ లో డిమాండ్ ఏర్పడిందో అర్ధం చేసుకోవచ్చు.
తాజాగా సూపర్ డీలక్స్ అనే చిత్రం హిందీ డబ్బింగ్ కు ముస్తాబు అవుతోంది. ఇందులో సమంత ఓ కీలకమైన పాత్ర పోషించగా, అమ్మడి నటనకు, లుక్స్ కు మంచి మర్కులు పడ్డాయి. దీంతో ఈ సినిమాను డబ్బింగ్ చేసి అక్కడ విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఏమైనా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్న సమంతకు అక్కడి జనాలు గ్రాండ్ వెల్కమ్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. మరి ఈ అవకాశాన్ని సామ్ ఎంతవరకూ అందిపుచ్చుకుంటుందో చూడాలి.