మరో బిగ్ బాలీవుడ్ సినిమాలో సమంత.. ఆ స్టార్ హీరో సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకుంటున్న హీరోయిన్లలో సమంత ఒకరు. ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేసిన సమంత ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు అందుకునే విధంగా అడుగులు వేస్తోంది. సోషల్ మీడియాలో రోజుకో గ్లామర్ ఫోటోతో షాక్ ఇస్తున్న సమంత ఇప్పుడు బాలీవుడ్ అగ్ర హీరోలతో కూడా బిగ్ బడ్జెట్ సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం సమంత భారీస్థాయిలో పారితోషికం కూడా డిమాండ్ చేస్తున్నట్లుగా టాక్. పూర్తి వివరాల్లోకి వెళితే...

విడాకుల అనంతరం సమంత దూకుడు

విడాకుల అనంతరం సమంత దూకుడు

సమంత రూత్ ప్రభు నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత తన కెరీర్ విషయంలో సరి కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక విధంగా గతంలో కంటే తన సినిమాల సెలక్షన్ లో చాలా విభిన్నమైన అడుగులు వేస్తోంది. సినిమా కెరీర్ ను తనకు నచ్చినట్టుగా మలుచుకుంటున్న సమంత కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకునే విధంగా అడుగులు వేస్తోంది.

ఆ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో..

ఆ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో..

అలాగే సమంత గత ఏడాది నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. అమెజాన్ ప్రైమ్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సక్సెస్ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత ఆమెకు హిందీలో నుంచి కూడా చాలా మంది దర్శక నిర్మాతలు డేట్స్ అడుగుతున్నారు. అయితే సమంత ఏ మాత్రం తొందర పడకుండా మంచి కంటెంట్ ఉన్న కథలనే సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటోంది. ఇప్పటికే ఆమె రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో అమెజాన్ ప్రైమ్ కోసం ఒక ప్రాజెక్టును మొదలు పెట్టబోతొంది.

పెద్ద సినిమాల్లో సమంత

పెద్ద సినిమాల్లో సమంత

అయితే ఆ ప్రాజెక్టు సెట్స్ పై ఉండగానే సమంతకు మరో బాలీవుడ్ ఆఫర్ వచ్చిందట. ఇటీవల పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక సమంతకు బాలీవుడ్ లో కూడా ఆ ఐటెం సాంగ్ తో మంచి గుర్తింపు లభించింది. ఇక సమంతకు ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ర దర్శకులు నిర్మాతలు ఆమె నుంచి డేట్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

అక్షయ్ కుమార్ సినిమాలో..

అక్షయ్ కుమార్ సినిమాలో..

అయితే రీసెంట్ గా సమంత అక్షయ్ కుమార్ చేయబోయే ఒక కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక ప్రముఖ దర్శకుడు తెరకెక్కించబోయే ఆ సినిమాలో సమంత మేయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా అలాగే మరొక బాలీవుడ్ హీరోయిన్ అందులో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోందిమ్ ఆ సినిమాలో సమంత పాత్ర రెండు విభిన్నమైన షేడ్స్ లో ఉంటుందని సమాచారం.

భారీగా రెమ్యునరేషన్

భారీగా రెమ్యునరేషన్

ప్రస్తుతం సమంత ఏ భాషల్లో నటించిన కూడా భారీ స్థాయిలో అయితే పారితోషికం దక్కుతోంది. ఆమె ఒక్కో సినిమాకు ప్రస్తుతం నాలుగు నుంచి 5 కోట్ల మధ్యలో పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక అక్షయ్ కుమార్ తో చేయబోయే సినిమా కోసం కూడా సమంత అదే తరహా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చేతిలో యశోద, శాకుంతలం అనే మంచి సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలతో అమ్మడు ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటుందో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X