Samantha: బాలీవుడ్ లో మరో స్టార్ హీరోతో సమంత బిగ్ మూవీ.. హై డిమాండ్!
బాలీవుడ్ సినిమా ప్రపంచంలో కూడా ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్స్ అవకాశాలు అందుకునే విధంగా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా స్పెషల్ సాంగ్స్ తో కూడా అక్కడ కొంతమంది ఇదివరకే భారీ స్థాయిలో క్రేజ్ అయితే అందుకున్నారు. ఇక పుష్ప సినిమా ద్వారా సమంత కూడా బాలీవుడ్ ఇండస్ట్రీని బాగానే ఆకట్టుకుంది. అంతకుముందే ఆమెకు ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ట్ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా మంచి కంటెంట్ తో ఉన్న సినిమాలతో గుర్తింపు అందుకోవాలని అనుకుంది.
అందుకే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసేందుకు ఒప్పుకోలేదు. ఇక రీసెంట్ గా సమంతకు బాలీవుడ్ లో ఒక అగ్ర హీరో సినిమాలో నటించే అవకాశం కూడా దొరికినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ ఆమె వరుణ్ ధావన్ తో ఒక బిగ్ ప్రాజెక్టులో నటించేందుకు ఒప్పుకుంది. ఇక అక్షయ్ కుమార్ తో కూడా సమంత నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వెంట వెంటనే సినిమాలు చేస్తున్న హీరోల్లో అక్షయ్ కుమార్ టాప్ లిస్టులో ఉంటాడు. ఇక అతను మరికొన్ని రోజుల్లో మొదలు పెట్టబోయే కొత్త ప్రాజెక్ట్ కోసం సమంతను ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఆ పరిచయంతోనే ఆమె మొదట కాఫీ విత్ కరణ్ షాలో అక్షయ్ కుమార్ తో పాల్గొన్నట్లు సమాచారం. అందులో అక్షయ్ కుమార్ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని చెప్పలేదు కానీ ముందుగానే వీరి ఇద్దరి కాంబినేషన్ సెట్ అయినట్లుగా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇక సమంత ప్రస్తుతం తెలుగులో అయితే ఒక ఖుషి సినిమాతో బిజీగా ఉంది.
ఇక ఇంతకుముందే ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాను పూర్తి చేసింది. అలాగే యశోద అనే మరొక థ్రిల్లర్ మూవీ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో తో పాటు చర్చల్లో మరో రెండు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి కానీ ఎక్కువగా మాత్రం సమంత బాలీవుడ్ ఇండస్ట్రీ పైన ఫోకస్ పెడుతోంది. ఇక అక్షయ్ కుమార్ తర్వాత ఆమె మరిన్ని మంచి ఆఫర్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











