బ్యాడ్ లక్.. 1200 కోట్లు పోగొట్టుకున్న సమంత.. అసలేం జరిగిందంటే..?

Samantha Ruth Prabhu: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వరుసగా సినిమాలు చేస్తూ.. భారీ విజయాలను అందుకుంది. తక్కువ సమయంలోనే భారీ పాపులరిటీని సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ ను అందుకుంది సమంత. అయితే.. సమంత ఓ నిర్ణయంతో ఏకంగా 1200 కోట్లు పోగొట్టుకున్నట్లు వార్త వెలుగులోకి వచ్చింది. ఇంతకీ సమంత తీసుకున్న నిర్ణయం ఏంటి ? ఆ వార్తలోని నిజానిజాలు ఏంటి? ఓ లూక్కెయ్యండి.

స్టార్ హీరోయిన్ సమంత 'ఏం మాయ చేసావే' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. తొలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ అమ్మడు. దీంతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది ఈ బ్యూటీ. ఇలా మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే..తన అందం అభినయంతో మెస్మరైస్ చేసి కోట్లాది మంది ప్రేక్షకులకు సొంతం చేసుకుంది.

Samantha Ruth Prabhu rejected Shah Rukh Khan Jawan movie

తన కెరీర్ పిక్ స్టేజ్ లో ఉన్నప్పుడే తన మొదటి సినిమా హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, వీరి వివాహం మూడు నాళ్ల ముచ్చటగా మారిపోయింది. ఎవరు ఊహించని విధంగా విడాకులు తీసుకొని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె అదృష్టం అంత బాగాలేదు. విడాకుల అనంతరం ఆమె మయోటిసిస్ అనే అరుదైన బారిన పడింది. ఈ చికిత్స కోసం దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. వరుసగా లేడీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ చేస్తూ బిజీబిజీగా మారింది.

అయితే ఈ అమ్మడు ఓ క్రేజీ ప్రాజెక్టు ను మిస్ చేసుకుందట. దాదాపు 1200 కోట్ల వసూళ్లు బాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ మూవీ లో నటించే అదృష్టాన్ని కోల్పోయిందట ఇంతకీ ఆ మూవీ ఏంటంటే.. ఆ సినిమా ఏదో కాదు.. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ల సునామీ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎవరు ఊహించని విధంగా రికార్డు స్థాయిలో దాదాపు 1200 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డ్ ను నెలకొల్పింది.

అలాంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలో సమంతను ముందుగా తీసుకున్నారట. తన పాత్ర కోసం ఆమెకు దాదాపు 12 కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కానీ, సమంత అదృష్టం బాగోలేదు. జవాన్ షూటింగ్ ప్రారంభం కానున్న సమయంలోనే.. సమంత 'మయోసైటిస్' అనే వ్యాధి బారిన పడింది. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ వ్యాధి నుండి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ, ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ సినిమాలో నటించే అవకాశం కోల్పోయింది సమంత.

Samantha Ruth Prabhu rejected Shah Rukh Khan Jawan movie

దీంతో సమంత స్థానంలో ఆమె స్నేహితురాలు, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఆ సినిమాలో నటించే అవకాశం అందిపుచ్చుకుంది. అలా నయనతార జవాన్ సినిమాలో నటించే అవకాశం పొందింది. నయనతార కూడా తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అలాగే జవాన్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టడమే కాకుండా.. మొదటిసారి 12 కోట్ల రెమ్యూనికేషన్ తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది నయనతార.

జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ అయి.. దాదాపు 1200 కోట్ల వసూళ్లు చేసిన విషయం తెలిసిందే. కానీ, సమంత మయోసైటిస్ వ్యాధి కారణంగా ఈ సినిమాలో భాగస్వామ్యం కాకపోవడంతో ఆమె 1200 కోట్ల ప్రాజెక్ట్ మిస్సయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. నిజంగా ఈ విషయంలో సమంత దురదృష్టవంతురాలు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X